KTR : కేంద్రమంత్రులను కలిసిన కేటీఆర్.. కీలక అంశాలపై చర్చ
- పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చట్టపరమైన చర్యలు
- యూజీసీ నిబంధనల్లో మార్పులపై బీఆర్ఎస్ అభ్యంతరం
- సిరిసిల్ల-కోరుట్ల జాతీయ రహదారి విస్తరణపై విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : బీఆర్ఎస్ పార్టీ తరఫున పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేసిన కేసును కూడా ఫాలోఅప్ చేయనున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ విషయంలో కోర్టులో పోరాడతామని, తమ పార్టీ నేతల బృందం న్యాయవాదులతో సమావేశమై తదుపరి చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
అంతేగాక, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కరీలను కలుసుకుని పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, భారతీయ విద్యా వ్యవస్థకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా భారత పౌరులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించగలగడం దేశంలోని విశ్వవిద్యాలయాల మూలంగా కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం యూజీసీ నిబంధనల్లో చేయనున్న మార్పులపై తమ అభ్యంతరాలను కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వివరించామని తెలిపారు.
Also Read
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
- DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
IND vs ENG: టీం నుండి కోహ్లీ, పంత్ అవుట్.. మొదట బ్యాటింగ్ చేయనున్న ఇంగ్లండ్
యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియామకానికి సంబంధించిన సర్చ్ కమిటీల బాధ్యతను పూర్తిగా రాష్ట్ర గవర్నర్‌కి అప్పగించడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే, “నో సూటబుల్ క్యాండిడేట్ ఫౌండ్” అనే నిబంధన ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల నియామకాన్ని తప్పించుకునే అవకాశం ఉందని, ఇది రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లకు భంగం కలిగించే ప్రమాదం ఉందని చెప్పారు. విద్యా సంస్థల్లో నియామక ప్రక్రియ విద్యార్హతలే కాకుండా పరిశోధనలకూ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని సూచించారు. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని కాపాడేలా యూజీసీ నూతన నిబంధనలు రూపొందించాలని కోరినట్లు కేటీఆర్ వెల్లడించారు.
ఇక, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ విజ్ఞప్తి మేరకు సిరిసిల్ల వరకు నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి 365-బీని వేములవాడ నుంచి కోరుట్ల వరకు విస్తరించాలని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేసినట్లు కేటీఆర్ తెలిపారు. మిడ్ మానేరు మీదుగా రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిని ఏర్పాటు చేసి వేములవాడ మీదుగా కోరుట్లలో జాతీయ రహదారి 63కి కలిపేలా విస్తరించాలని కోరినట్లు ఆయన వెల్లడించారు.
Mahindra XUV400 : బంఫర్ ఆఫర్.. ఈ మహీంద్రా ఎలక్ట్రిక్ కారుపై ఏకంగా 4లక్షల తగ్గింపు!
తాజావార్తలు
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!