Site icon NTV Telugu

BRS vs Speaker: ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో కీలక పరిణామం.. స్పీకర్పై కోర్టుధిక్కార పిటిషన్

Spker

Spker

BRS vs Speaker: తెలంగాణ శాసనసభ స్పీకర్‌పై బీఆర్‌ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేసింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలో మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ పూర్తి చేయలేదంటూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరపున ఈ పిటిషన్ దాఖలు అయింది. కాగా, ఈ కేసు విషయంలో ఎమ్మెల్యేల విచారణకు సంబంధించి మరింత గడువు కావాలని కోరుతూ స్పీకర్ కార్యాలయం ఇప్పటికే సుప్రీంకోర్టులో అదనపు పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై వచ్చే సోమవారం విచారణ జరగనుంది.

Read Also: Govinda- Sunita : నాకన్నా హీరోయిన్లతోనే ఎక్కువగా గడిపాడు.. గోవిందా భార్య షాకింగ్ కామెంట్స్!

కాగా, తమ కోర్టు ధిక్కార పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ జరపాలని కోరుతూ బీఆర్‌ఎస్ పార్టీ న్యాయవాది మోహిత్ రావు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. తమ కేసును కోర్టు ముందు రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని బీఆర్‌ఎస్ తరపు న్యాయవాది ఆరోపించారు. ఇక, దీనిపై స్పందించిన చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, నేను ఈ నెల 23వ తేదీన రిటైర్ అవుతాను.. ఆ తర్వాత సుప్రీంకోర్టు నవంబర్ 24వ తేదీ నుంచి మూసివేయ్యరు అని వ్యాఖ్యానించారు. విచారణ ముగిసిన తర్వాత చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణను వచ్చే సోమవారం చేపడతామని స్పష్టం చేసింది.

Exit mobile version