BRS vs Speaker: తెలంగాణ శాసనసభ స్పీకర్‌పై బీఆర్‌ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేసింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలో మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ పూర్తి చేయలేదంటూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరపున ఈ పిటిషన్ దాఖలు అయింది.