Site icon NTV Telugu

BRS KTR: వరంగల్‌ పార్లమెంటుకు సమన్వయకర్తలను నియమించిన కేటీఆర్‌

Brs Ktr

Brs Ktr

BRS KTR: బీఆర్‌ఎస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. ప్రచారంలో ముందుకు దూసుకుపోతుంది. లోక్ సభ నియోజకవర్గ సమావేశాలతో నేతలు, శ్రేణులు కార్యాచరణలో నిమగ్నమయ్యారు. పెద్ద ఎత్తున సమావేశాలు, ఎండిన పంటల పరిశీలనతో ప్రజల్లోకి వెళ్తున్నారు.

ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న గులాబీ నేతలు.. గత ఎన్నికల్లో జరిగిన తప్పిదాలను దృష్టిలో పెట్టుకుని.. లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించాలని కార్యకర్తలు, అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అత్యధిక స్థానాలు గెలవాలని భావిస్తున్న పార్టీ సెగ్మెంట్ల వారీగా పార్లమెంటరీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించేందుకు రంగం సిద్దం చేస్తుంది. ఈ నేపథ్యంలో వరంగల్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఏడుగురు సమన్వయకర్తలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు.

Read also: WhatsApp : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్.. స్టేటస్ కోసం..

అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా..

1. పరకాల- ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ముదిరాజ్
2. పాలకుర్తి- ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, మెట్టు శ్రీనివాస్
3. స్టేషన్ ఘన్‌పూర్- ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
4. వరంగల్ పశ్చిమ- కుడా మాజీ చైర్మన్లు మర్రి యాదవ రెడ్డి, నాగుర్ల వెంకన్న, కుడా చైర్మన్ ఎస్.సుందర్ రాజ్
5. వరంగల్ తూర్పు- ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
6. వర్ధన్నపేట- కె.వాసుదేవ రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ సమ్మారావు
7. భూపాలపల్లి- ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య
Gopichand : ‘విశ్వం’ హిందీ రైట్స్ ఎంతకు అమ్మారంటే..?

Exit mobile version