కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.. కరోనా కేసులు పెరుగుతుండడంతో.. ఇప్పటికే కఠిన చర్యలకు పూనుకుంటున్నాయి ఆయా రాష్ట్రాలు.. ఇక, తెలంగాణకు సమీపంలో ఉన్న మహారాష్ట్రలో కరోనా విలయం సృష్టిస్తుండగా.. కర్ణాటకలోనూ భారీగా కేసులు వెలుగు చూస్తున్నాయి.. దీంతో.. సరిహద్దు గ్రామాల్లో టెన్షన్ మొదలైంది.. హారాష్ట్ర – కర్ణాటక సరిహద్దులోని కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో కరోనా విజృంభిస్తున కారణంగా.. తెలంగాణ గ్రామాల నుంచి మహారాష్ట్రకు వెళ్లేదారులలో రోడ్లు తవ్వి ముళ్ల కంచెలు వేసి రాకపోకలు నిలిపివేశారు స్థానికులు.. అయితే, సలాబతపూర్ చెక్ పోస్ట్ నుంచి మాత్రం మహారాష్ట్రకు వాహనాల రాకపోకలు యథాతథంగా కొనసాగుతున్నాయి.