Ponnam Prabhakar : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో మంత్రివర్గం ప్రత్యేక సమీక్షా సమావేశం జరిగింది. జూలై 26నుంచి ప్రారంభం కానున్న బోనాల పండుగను పురస్కరించుకొని, రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఉత్సవాలకు సంబంధించి అన్ని విభాగాలతో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఆషాఢ మాస బోనాల పండుగను అన్ని రాజకీయాలకు అతీతంగా, అన్ని శాఖల సమన్వయంతో గొప్పగా నిర్వహించాలి. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అశాంతి లేకుండా పండుగ జరగాలని కృషి చేయాలి అని అధికారులను ఆదేశించారు.
Phone Tapping : సిట్ ముందుకు ఈటల రాజేందర్
పండుగ సమయంలో విద్యుత్, తాగునీరు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించిన మంత్రి.. ఎలక్ట్రిసిటీ వ్యవహారాన్ని ఎంతో జాగ్రత్తగా పర్యవేక్షించాలి. తోపులాటలు జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలి అని పేర్కొన్నారు. లష్కర్ బోనాలు హైదరాబాద్‌కి గర్వకారణమని, మన హైదరాబాద్ వాసులు అతిథులకు ఆతిథ్యం చెప్పడంలో ప్రసిద్ధులు అన్నారు. ఆలయానికి వచ్చే ప్రతి ఒక్కరికి సౌకర్యవంతమైన దర్శనం కల్పించాల్సిన బాధ్యత మనదే అని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు.
గోల్కొండ, ఉజ్జయిని, బల్కంపేట, లాల్ దర్వాజా బోనాలకు విశేష ప్రాధాన్యం ఉందని, నాలుగు వారాలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. బోనం ఎత్తుకునే భక్తులంతా VIP లేనని చెప్పిన మంత్రి, VIP పాసులు బోనాలే లేని రోజుల్లో మాత్రమే ఇస్తామని స్పష్టం చేశారు. సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని పునరుద్ఘాటించారు. పండుగను మహత్త్వంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయం అవసరమని, అమ్మవారి ఆశీర్వాదంతో ఉత్సవాలు సాఫీగా, విజయవంతంగా పూర్తవుతాయని మంత్రి అభిప్రాయపడ్డారు.
