boAt Airdopes Prime 701 ANC: భారతదేశ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, “బిల్ట్ ఫర్ ఇండియా” అనే కాన్సెప్ట్‌తో boAt కంపెనీ తన కొత్త తరం TWS ఇయర్‌బడ్స్ అయిన Airdopes Prime 701 ANC ను లాంచ్ చేసింది. మంచి ఫీచర్లతో, క్వాలిటీలో రాజీపడకుండా, మన్నికగా ఉండేలా రూపొందించిన ఈ బడ్స్ బోట్ ప్రైమ్ ప్రామిస్ పథకం కింద లభిస్తున్నాయి. మరి ఈ కొత్త ఇయర్‌బడ్స్ గురించి పూర్తి వివరాలను ఒకసారి చూద్దామా..
Read Also:Tragic : పదోతరగతిలో ప్రేమ.. మందలించిన తల్లి.. ప్రియుడితో కలిసి తల్లిని చంపిన బాలిక
boAt Airdopes Prime 701 ANC ఇయర్‌బడ్స్ లో 10mm డ్రైవర్లు ఉండగా, 24-bit boAt స్పటిల్ ఆడియోతో మంచి ఆడియో అనుభూతిని మరో స్థాయికి తీసుకెళ్తాయి. బ్లూటూత్ v5.2, గూగుల్ ఫాస్ట్ పెయిర్ వంటి ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఇవి హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌తో వస్తున్నాయి. ఇది గరిష్టంగా 46dB వరకు బ్యాక్ గ్రౌండ్ శబ్దాన్ని అడ్డుకుంటుంది. తద్వారా క్లీన్ ఆడియో అనుభూతి లభిస్తుంది.
Read Also:Stock Market: ట్రంప్ ప్రకటనతో మార్కెట్‌కు జోష్.. భారీ లాభాల్లో సూచీలు
ASAP ఛార్జ్ టెక్నాలజీ ద్వారా కేవలం 10 నిమిషాల్లో 3 గంటల ప్లేబ్యాక్ లభిస్తుంది. మొత్తం బ్యాటరీ బ్యాకప్ దాదాపు 50 గంటలు. అంటే ఒకసారి ఛార్జ్ చేస్తే ఆడియో వినోదాన్ని ఎక్కువ సమయం ఆస్వాదించవచ్చు. కాల్స్ విషయంలో AI ENx టెక్నాలజీతో కూడిన 4 మైక్రోఫోన్లు ఉన్నందున, స్పష్టమైన వాయిస్ కమ్యూనికేషన్ సౌలభ్యం ఉంటుంది. ఇంకా ఈ boAt Airdopes Prime 701 ANC లోని ప్రత్యేక ఫీచర్లను చూసినట్లతే..
BEAST మోడ్ ద్వారా గేమింగ్ కోసం 60ms తక్కువ లేటెన్సీ, boAt Adaptive EQ (Mimi-powered) ద్వారా వ్యక్తిగత ఆడియో ట్యూనింగ్, ఇన్-ఇయర్ డిటెక్షన్, మల్టీపాయింట్ కనెక్టివిటీ, IPX5 వాటర్ రెసిస్టెన్స్, boAt Hearables App సపోర్ట్‌తో అనేక కస్టమైజేషన్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఇయర్‌బడ్స్ రూ.1,999 ధరకు లభించనున్నాయి. అలాగే ఒక సంవత్సరం వారంటీ కూడా లభిస్తుంది. ఈ ఇయర్‌బడ్స్ జింక్ వైట్, అబ్‌సిడియన్ గ్రే, టైటానియం బ్లూ అనే మూడు రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. boAt అధికారిక వెబ్‌సైట్, అమెజాన్ లో వీటిని కొనుగోలు చేయవచ్చు.