కేసీఆర్ సారూ.. వీటికి జవాబు చెప్పండి.. బండి సంజయ్ 10 ప్రశ్నలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన పాదయాత్రలో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తిచూపుతూ.. సీఎం కేసీఆర్, మంత్రులను ఎవ్వరినీ వదలకుండా హాట్ కామెంట్లు చేస్తూ వస్తున్నారు.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. ఇక, కేసీఆర్ సారూ వీటికి జవాబు చెప్పిండి అంటూ.. సీఎంకు 10 ప్రశ్నలు సంధించారు..
- కేసీఆర్ జమానా – అవినీతి ఖజానా… అని సకల జనులు తెలంగాణలో ఘోషిస్తున్నారు? దీనికి మీ జవాబు ఏమిటి?
- కేసీఆర్ గారు మీరు నివసిస్తున్న ప్రగతి భవన్ ‘అవినీతి భవన్’గా, ‘తెలంగాణ ద్రోహులకు నిలయం’గా మారింది అన్నది వాస్తవం? దీనికి మీ సమాధానం ఏమిటి?
- దేశంలోనే అత్యంత అవినీతిపరుడు, ధనవంతుడు కేసీఆర్ అని పేరుంది… దీనికి మీరు స్పందించి, మీ నిజాయితీని, సచ్ఛీలతను నిరూపించుకొంటారా?
- 2014లో మీరు ముఖ్యమంత్రి పదవి చేపట్టే నాటికి మీ ఆస్తులు, మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు ఆస్తులు ఎంత? ఇప్పుడు ఎంత? మీ ఆస్తులు లక్ష రెట్లు పెరిగిన మాట నిజం కాదా? దీనిపై చర్చకు మీరు సిద్ధమా?
- కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైన్ పేరిట అంచనాలు పెంచి కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మీరు కొల్లగొట్టారా లేదా?
- పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, ఇతర సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణంలో, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, విద్యుత్ ప్రాజెక్టుల, విద్యుత్ కొనుగోళ్లు, ప్రభుత్వ భూములు అమ్మకాల్లో కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, వీటికి సంబంధిచిన ఫైల్స్, సంబంధిత పత్రాలు అఖిలపక్షం ముందు పెట్టి దీనిపై చర్చించడానికి మీరు ముందుకు వస్తారా?
- మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు, మీ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు చేస్తున్న ఇసుక, లిక్కర్, డ్రగ్స్ దందాలు, భూకబ్జాలపై స్వతం సంస్థతో దర్యాప్తు జరిపించి అవినీతి, అక్రమాలు జరగడం లేదని మీరు నిరూపించుకోగలరా?
- మీరు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఓటుకు – నోటు పథకాన్ని ప్రవేశపెట్టి మీరు సంపాదించిన కోట్ల రూపాయల అక్రమ సొమ్ముతో సాధారణ ఎన్నికలు, ఉపఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నమాట వాస్తవం కాదా?
- ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులను మీ అవినీతి సొమ్ముతో సంతలో సరకులాగా కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న మాట నిజం కాదా?
- బంగారు తెలంగాణ చేస్తానని, అక్రమ మార్గాల ద్వారా కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కొల్లగొట్టి మీ కుటుంబాన్ని, మీ బంధువులను, మీ పార్టీ వారిని బంగారుమయం చేసి ప్రజలను బికార్లుగా మార్చిన ఘనత మీది కాదా..?
బాధ్యత గల పార్టీగా ప్రజల పక్షాన బీజేపీ తరఫున రేపు మరిన్ని ప్రశ్నలు సంధించనున్నాం అంటూ పేర్కొన్నారు బండి సంజయ్ కుమార్..
Also Read
- Harish Rao : రేవంత్‌కు హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్.. ‘నిరూపిస్తే రాజీనామా.!’
- CM Revanth Reddy : జగ్గారెడ్డి లాంటి నాయకుడు వెయ్యి కోట్లు ఇచ్చినా దొరకడు
- CM Revanth Reddy : 70 వేల జాబ్స్ భర్తీ.. పేపర్ లీకేజీలపై బీఆర్ఎస్కు రేవంత్ కౌంటర్.!
- CM Revanth Reddy : సంగారెడ్డి సభలో రేవంత్ రెడ్డి ఫైర్.. కేసీఆర్‌కు సవాల్.!
తాజావార్తలు
-
Aasmaan : గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘ఆస్మాన్’ ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్!
-
Suriya: ‘‘ఈ సక్సెస్‌ను నంబర్లతో కొలవలేం’’.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై సూర్య ఎమోషనల్ కామెంట్స్!
-
CM Yogi: ‘మీలా పాడలేను.. బుల్డోజర్ నడపగలను’.. కళాకారులతో సీఎం యోగీ కీలక సంభాషణ
-
Trivikram Srinivas: సూర్యతో సినిమా చేయలేకపోయా.. త్వరలోనే చేస్తా: త్రివిక్రమ్ శ్రీనివాస్
-
Gen Z Lifestyle: ‘జెన్ జీ’ లైఫ్‌స్టైల్ వెనుక అసలు నిజం.. టూర్లు కావు.. 70% డబ్బు దేనికి పోతోందో తెలుసా..?
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!