NTV Telugu Site icon

Bandi Sanjay Letter to CM KCR: రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ

Kcr, Bandi Sanjay

Kcr, Bandi Sanjay

Bandi Sanjay Letter to CM KCR: రాఖీ పౌర్ణమి సందర్భంగా డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలకు రూ.4 వేల కోట్ల వడ్డీబకాయిల విడుదల చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండిసంజయ్‌ బహిరంగ లేఖ రాసారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ , పట్టణపేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా), ఎస్‌హెచ్‌జి లకు ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ బకాయిలు రూ.4 వేల కోట్ల వరకు పేరుకుపోయాయని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ఎనిమిది సంవత్సరాల పాలనలో డ్వాక్రా గ్రూపులను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.

read also: Legends League Cricket: లెజెండ్ లీగ్ క్రికెట్ షెడ్యూల్ ఫిక్స్.. 75వ స్వాతంత్య్ర దినోత్సవం గుర్తుగా స్పెషల్ మ్యాచ్

2021-22 బడ్జెట్‌లో మహిళాగ్రూపులకు వడ్డీ చెల్లించేందుకు 3 వేల కోట్లు కేటాయించినా ఇప్పటికీ అమలు కాలేదని గుర్తు చేశారు. 2022-23 బడ్జెట్‌లో రూ.1250 కోట్లు కేటాయించినా ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదని లేఖలో తెలిపారు. ప్రభుత్వం నుండి వడ్డీ రాయితీ లభిస్తుందని ఆశతో రుణాలు తీసుకున్న మహిళలు ప్రభుత్వ నిర్వాకంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బండి సంజయ్‌ పేర్కొన్నారు. మహిళా స్వయం సహాయకసంఘాలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో అర కొరగా నిధులు విధిలిస్తూ మహిళల సాధికారితపట్ల చిన్నచూపు చూడటం గర్హనీయమన్నారు. మహిళల పట్ల, మహిళాసాధికారత పట్ల ప్రభుత్వం ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని విడనాడాలని తెలిపారు. డ్వాక్రా గ్రూపులకు చెల్లించాల్సిన రూ.4 వేల కోట్ల వడ్డీ బకాయిలను విడుదల చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని బీజేపీ తెలంగాణశాఖ తరుపున కోరుతున్నామని బండి సంజయ్‌ లేఖలో పేర్కొన్నారు.
Polavaram Flood Victims: విలీన మండలాల్లో హోరెత్తిన పోలవరం నిర్వాసితుల ఆందోళన.. వరద నీటిలో నిరసన