Ramchander Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై విచారణ కమిషన్ నివేదిక హాట్ టాపిక్‌గా మారింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతున్న వేళ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఈ అంశంపై స్పందించారు. నివేదిక లీకులపై తమకు ఎలాంటి ఆసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. “ప్రభుత్వం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాతే మేము స్పందిస్తాం. ఇప్పుడే బయటకు వస్తున్న ఈ నివేదిక ప్రభుత్వానిదా? లేక కాంగ్రెస్‌దా?” అని ఆయన ప్రశ్నించారు.
బీజేపీ మొదటి నుంచే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెబుతోందని రాంచందర్ రావు గుర్తు చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరగాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు.
Ukraine: రష్యాలో పాక్, చైనా కిరాయి సైనికులు.. జెలెన్‌స్కీ ఆరోపణలు
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో నిజమైన చిత్తశుద్ధి చూపడం లేదని ఆయన విమర్శించారు. ముఖ్యంగా బీసీ జాబితాలో ముస్లింలను కలపకూడదని, ఇది బీసీలకు అన్యాయం అవుతుందని ఆయన పెద్దపల్లిలో స్పష్టం చేశారు.
ప్రస్తుతం మీడియాలో చక్కర్లు కొడుతున్న నివేదిక లీకులపై బీజేపీ ఎలాంటి వ్యాఖ్యలు చేయబోదని రాంచందర్ రావు తెలిపారు. “ప్రభుత్వం అసెంబ్లీలో పూర్తి నివేదికను ప్రవేశపెట్టిన తర్వాతే మా అభిప్రాయాన్ని వెల్లడిస్తాం,” అని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం నివేదికను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. “ప్రజలకు వాస్తవాలు తెలిసేలా పూర్తి వివరాలతో నివేదికను అసెంబ్లీలో ఉంచాలి,” అని రాంచందర్ రావు డిమాండ్ చేశారు.
Flash Back : మహేశ్ తో ఆ సినిమా హిట్ అయితే నువ్వు స్టార్ హీరో కాలేవని కృష్ణ చెప్పారట
