Site icon NTV Telugu

BJP Nirudyoga march: నేడే సంగారెడ్డిలో నిరుద్యోగ మార్చ్.. బీజేపీ క్యాడర్‌కు బండి సంజయ్‌ పిలుపు

Bandi Sanjay

Bandi Sanjay

BJP Nirudyoga march: నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నేడు ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో బీజేపీ శ్రేణులు “నిరుద్యోగ యాత్ర” నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, ఈటల, విజయశాంతి, రఘునందన్ రావు, రాష్ట్ర బీజేపీ నేతలు పాల్గొంటారు. ఈ నిరుద్యోగ మార్చ్ సంగారెడ్డి ఐబీ గెస్ట్ హౌజ్ నుంచి పోతిరెడ్డిపల్లి క్రాస్ రోడ్ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

సంగారెడ్డి పట్టణంలో నేడు నిర్వహించే నిరుద్యోగ యాత్రను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ వల్ల నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగులకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో నిరుద్యోగ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టే శక్తి బీజేపీకి ఉందని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ , మహబూబ్ నగర్ జిల్లాల్లో నిరుద్యోగ యాత్ర విజయవంతమైందని, సంగారెడ్డి జిల్లాలోనూ నిరుద్యోగ యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ అనాలోచిత విధానాల వల్ల తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్ నాశనమయ్యే ప్రమాదం ఉందని బండి సంజయ్ అన్నారు.

Read also: Dattatreya Stotram: గురువారం ఈ స్తోత్రం వింటే చక్కటి సంతానం,అనంత పుణ్యదాయకం

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఉద్యోగాలు ఇవ్వకుండా, నిరుద్యోగ భృతిని అమలు చేయకుండా తెలంగాణ ప్రజల బతుకు అథోగతి పాలవుతున్నా సీఎం కేసీఆర్ ఇంతవరకు స్పందించకపోవడం దారుణం అని బండి సంజయ్ అన్నారు. తూతూ మంత్రంగా కొంతమందిని అరెస్ట్ చేసి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు అని బండి సంజయ్ అన్నారు. సిట్ దర్యాప్తు నిందితులకు కొమ్ముకాయడానకే పనిచేస్తోంది తప్ప నివేదిక ఇచ్చిన దాఖలాల్లేవు అని అన్నారు. ఈ నేపథ్యంలో పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని నిరుద్యోగులకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నామని బండి సంజయ్ తెలిపారు. తెలంగాణలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారు.

బీజేపీ చేస్తున్న ఉద్యమాలను గమనిస్తున్నారు అని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించే సత్తా బీజేపీకే ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో నిర్వహించిన నిరుద్యోగ మార్చ్ ను విజయవంతం చేశారు. సంగారెడ్డి జిల్లాలో చేపట్టే నిరుద్యోగ మార్చ్ ను సక్సెస్ చేసి ఉమ్మడి మెదక్ జిల్లా బీజేపీకి అడ్డా అని నిరూపించాలన్నారు. అందుకోసం నిబద్ధత కలిగిన కార్యకర్తలంతా ఈ నిరుద్యోగ మార్చ్ లో పాల్గొనాలి.. పోలింగ్ బూత్ సభ్యులంతా ఒక్కొక్కరు కనీసం వందమందిని తీసుకురావాలి. మీడియా, సోషల్ మీడియాలో విస్త్రత ప్రచారం నిర్వహించాలి అని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
Dattatreya Stotram: గురువారం ఈ స్తోత్రం వింటే చక్కటి సంతానం,అనంత పుణ్యదాయకం

Exit mobile version