Site icon NTV Telugu

BJP MP Laxman: జమిలి ఎన్నికలు రావాలని కోరుకుంటున్నాం

Bjp Mp Laxman

Bjp Mp Laxman

BJP MP Laxman: జమిలి ఎన్నికలు రావాలని కోరుకుంటున్నామని బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ మెంబర్ డా.లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టేందుకు కేసీఆర్ ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని కోరారు. ప్రధాని, గవర్నర్, కేంద్ర మంత్రులకు కనీస మర్యాద ఇవ్వడం లేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక కేసీఆర్ కొత్త పాట అందుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీకి వీఆర్ఎస్ ఇచ్చారు.. బీఆర్ఎస్.. పొలిటికల్ రిహాబిటేషన్ సెంటర్ అని వ్యాఖ్యానించారు. అసలు విషయం పక్కదారి పట్టించడానికి బీఆర్ఎస్ పార్టీ ఏర్పటు చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అట్టర్ ప్లాప్ సినిమా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని తొండి మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. కొత్త కార్పొరేషన్లు సృష్టించి FRBM పరిధి దాటి అప్పులు చేశారని మండిపడ్డారు.

Read also:Bundles of Notes Found At Begger: బాబోయ్‌ నోట్ల కట్టలు.. బిచ్చగాడి వద్ద డబ్బులే డబ్బులు

అప్పులు పుట్టడం లేదని కేసీఆర్ ఎడుస్తున్నారని ఎద్దేవ చేశారు. ఒకవైపు ప్రజలపై పన్నుల భారం పెంచుతున్నారు, మద్యం ధరలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ చార్జీలు, కరెంట్ చార్జీలు, బస్సు ఛార్జీలు పెంచారని అన్నారు. భూములు అమ్మిన సొమ్ములు అన్ని ఎక్కడికి పోతున్నాయని ప్రశ్నించారు లక్ష్మణ్‌. కొత్త అప్పుల కోసం కేసీఆర్ పడిగాపులు కాస్తున్నారని ఆరోపించారు. 3లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి.. భర్తీ చేయడం లేదని మండిపడ్డారు. నోటిఫికేషన్లు ఇస్తున్నట్లు చెబుతున్నారు.. కానీ భర్తీ మాత్రం చేయడం లేదని నిప్పులు చెరిగారు. భూముల విలువ పెంచడానికే మెట్రో ఏర్పటు చేస్తున్నారు ఆరోపించారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మెట్రో నిర్మాణం అని ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు చేసిన ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్రం నిధులు ఉన్నట్లే కదా? అని ప్రశ్నించారు. పాతబస్తీలో ఆరు కిలోమీటర్లు వేయలేని కేసీఆర్.. ఇప్పుడు కొత్త మెట్రోకు భూమి పూజ చేయడం హాస్యాస్పదం అని ఎద్దేవ చేశారు. బీఆర్ఎస్ పార్టీని నమ్మితే బక్వాస్ సర్కార్.. పరివార్ సర్కార్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read also: Graves at Home: ఇదెక్కడి ఖర్మరా నాయనా.. కళలో బాబా చెప్పాడని ఇంట్లో మూడు సమాధులా!

చెల్లని చెక్కులు పంజాబ్ రైతులకు ఇచ్చి తెలంగాణ పరువు తీశారని మండిపడ్డారు. జ్యోతిష్యులు సూచన మేరకు.. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారన్నారు. మూఢ నమ్మకాలతో పార్టీని నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీని తిట్టడానికి కాకుండా.. తెలంగాణ ప్రజల సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారని ఆరోపిచారు. కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమన్నారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది ఎన్నికల కమిషన్ నిర్ణయమన్నారు. అసెంబ్లీ రద్దు చేయడం వరకే కేసీఆర్ చేతిలో పని అయితే.. జమిలి ఎన్నికలు రావాలని కోరుకుంటున్నామన్నారు. కేంద్రం నిధులు మళ్లించి… పేద ప్రజలను తెలంగాణ ప్రభుత్వం వంచిస్తుందని, భూసార పరీక్షలకు కేంద్రం ఇచ్చే నిధులను పక్కదారి పట్టించారన్నారు. ప్రధాన మంత్రి అవాస్ యోజన కింద కేంద్రం ఇచ్చిన నిధులు తీసుకోని.. ఇల్లు కూడా కట్టించి ఇవ్వడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ ప్రధానిపై వ్యక్తిగత విమర్శలు చేసి ముఖం చెల్లక మోడీని కలవడానికి కూడా సంకోచిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Minister Roja Dance: డ్యాన్స్ తో దుమ్మురేపిన మంత్రి రోజా

Exit mobile version