K Laxman: ఇచ్చిన హామీల్ని కేసీఆర్ తుంగలో తొక్కారు.. తెలంగాణని భ్రష్టు పట్టించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MP K Laxman Sensational Comments On CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా.లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 9 ఏళ్లలో తెలంగాణను కేసీఆర్ భ్రష్టు పట్టించారని.. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ఆరోపించారు. ఎస్సీ సబ్ ప్లాన్‌ను పక్కనపెట్టారని.. కాగితాలపై అంకెల గారడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రైవేటు ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో విదేశాలు తిరుగుతూ.. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ఇప్పటివరకు రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తెచ్చారు? అని ప్రశ్నించారు. డొల్ల కంపెనీలకు విలువైన భూములను అప్పనంగా కట్టపెడుతున్నారని.. భూముల కేటాయింపులపై కోర్టులు మొట్టికాయలు వేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.
Tamil Nadu: మతాంతర సంబంధంపై తల్లిదండ్రుల ఆగ్రహం.. అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య..
Also Read
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
తెలంగాణలో మేధస్సు ఉన్న అధికారులు లేరా? అని నిలదీసిన కే లక్ష్మణ్.. ఇతర ప్రాంతాలకు చెందిన వారిని సలహాదారులుగా నియమించుకున్నారని విరుచుకుపడ్డారు. యూనివర్సిటీల్లో నియామకాలు లేవని, పోస్టులు ఖాళీగానే ఉన్నాయని అన్నారు. బిస్వల్ కమిటీ చెప్పినట్లు.. లక్ష 90 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వానికి జీఓలపై గోప్యత ఎందుకు? అని ప్రశ్నించారు. 5 ఏళ్ల క్రితం ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఫైబర్ ఇంటర్నెట్ ఏమైందని అడిగారు. బతుకమ్మ చీరలను గుజరాత్ నుంచి తీసుకురాకుండా.. ఇక్కడ చనేత కార్మికులకు పని కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందని నిలదీశారు. తెలంగాణలో మూతపడ్డ పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తెరిపించడం లేదన్నారు. ప్రధాని మోడీ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించారని గుర్తు చేశారు. సింగరేణి పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటోందని, 51 శాతం రాష్ట్ర ప్రభుత్వం వాాట ఉన్న సింగరేణిని కేంద్రం ఎలా ప్రైవేటుపరం చేస్తుందని అడిగారు.
Nagam Janardhan Reddy: కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి.. నాగం జనార్ధన్ డిమాండ్
మోడీ తెరిచిన రామగుండం కంపెనీలో బీఆర్ఎస్ నేతలు ఉద్యోగాలు అమ్ముకున్నారని కే లక్ష్మణ్ ఆరోపణలు చేశారు. తెలంగాణలో రైల్వే అభివృద్ధికి కేంద్రం రూ.4,446 కోట్లు కేటాయించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా.. కేంద్రం తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. పాతబస్తీలో ఎందుకు మెట్రో రైలు సదుపాయం కల్పించడం లేదని అడిగారు. ఐటీ సెక్టార్‌కు కేటాయించిన భూములు.. కల్పించిన ఉద్యోగాలు సంఖ్యపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతూ.. తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని వ్యాఖ్యానించారు. కుటుంబ ప్రయోజనాల కోసమే తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని విమర్శించారు. డబుల్ ఇంజన్ సర్కార్‌తో డబుల్ ఇంజన్ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!