Raja Singh: తనకు బెదిరింపు కాల్స, మెసేజ్ లు వస్తున్నాయని ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసులకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినా ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయకపోవడం విడ్డూరంగా వుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కమాండ్ కంట్రోల్ రూం ఎందుకు ఉందని ఆయన ప్రశ్నించారు. బీజేపీ , కాంగ్రెస్ నేతల పోన్ లు టాపింగ్ చేయడానికి, బీజేపీ తో బీఆర్‌ఎస్ నేతలు ఎవరు టచ్ లో ఉన్నారు అని తెలుసుకోవడానికి ఉందా? అంటూ వ్యంగాస్త్రం వేశారు రాజాసింగ్. బెదిరిస్తున్నారని కాల్స్, మెసేజ్ లు వస్తున్నాయని చెప్పిన ఇప్పటి వరకు ఆక్షన్ తీసుకోలేదని మండిపడ్డారు. నన్ను చంపుతామని, స్లిపర్ సెల్స్ మీ చుట్టే ఉన్నారని బెదిరిస్తున్నారని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని మండిపడ్డారు. టెర్రరిస్ట్ లకు ఎంఐఎం ఆశీర్వాదం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిని అరెస్ట్ చేస్తే ఉద్యోగాలు పోతాయని పోలీసులు భయపడుతున్నారా? అంటూ ప్రశ్నించారు రాజాసింగ్.
Read also: Kondagattu Temple: కొండగట్టు ఆలయంలో చోరీ.. బంగారు నగలతో పాటు విగ్రహాలు మాయం
రాజా సింగ్ పై దేశాన్ని ధర్మాన్ని టార్గెట్ చేస్తూ అసభ్య పదజాలంతో మెసేజ్ లు రావడం సంచలనంగా మారింది. గత కొన్ని రోజులుగా విదేశాల నుండి మెసేజ్ లు, పాకిస్తాన్ నుండి పోన్ కాల్ రావడంతో.. తనకు వస్తున్న మెసేజ్ లపై రాజా సింగ్ డీజీపీ పిర్యాదు చేసారు. గతంలో హరేన్ పాండ్య హత్య కేసులో టెర్రరిస్టులను అరెస్ట్ చేయడానికి వస్తే ఎంఐఎం కమిషనర్ కార్యాలయం ముందు ప్రొటెస్ట్ చేశారని ఆరోపించారు. టెర్రరిస్టులకు ఆర్థికంగా, ఫిజికల్ ఎంఐఎం సహకరిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని రాజాసింగ్ పేర్కొన్నారు. నేను దేనికి భయపడనని, నాకు జైలు ఫార్మ్ హౌస్ వంటిదని, దేశం కోసం దేనికైనా సిద్ధమన్నారు రాజాసింగ్. ధర్మం కోసం చావాలి..దేశ ద్రోహులను చంపాలని లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాని తెలిపారు. మళ్ళీ జైలుకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నానని, రెండు సార్లు ఎమ్మెల్యే అయిన చాలని రాజాసింగ్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
Cyber Thieves: టెలిగ్రామ్ యాప్, డేటాఫ్ బర్త్ పేరిట మోసం.. కోట్లు కొట్టేస్తున్న సైబర్ కేటుగాళ్లు