వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు… మొదట రాజాసింగ్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.. ఆ తర్వాత రాజాసింగ్ రిమాండ్‌ను కోర్టు రిజెక్ట్ చేసింది. 41 సీఆర్‌పీసీ కండిషన్ పోలీసులు పాటించలేదని వాదించారు రాజాసింగ్ తరపు న్యాయవాది.. రాజాసింగ్ లాయర్లు, ప్రభుత్వ లాయర్ల మధ్య బెయిల్ పిటిషన్‌పై దాదాపు 45 నిమిషాలపాటు వాదనలు కొనసాగాయి.. అయితే, రాజాసింగ్ తరపు లాయర్ల వాదనలతో ఏకీభవించిన కోర్టు.. పోలీసులు రిమాండ్ చేసిన విధానం సరిగా లేదని అభిప్రాయపడింది.. దీంతో రాజా సింగ్ రిమాండ్ ను తిరస్కరించింది.. ఆయకు బెయిల్ మంజూరు చేస్తూ.. వెంటనే రాజా సింగ్ ను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది..
అయితే, రాజాసింగ్‌కు బెయిల్ ఇస్తే అల్లర్లు పెరుగుతాయని ప్రభుత్వ తరఫు లాయర్లు కోర్టులో వాదనలు వినిపించారు.. కానీ, రాజాసింగ్ ప్రజాప్రతినిధి అని, ఆయనకు 41 సీఆర్‌పీసీ సెక్షన్ల కింద నోటీసులు ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఆయన తరఫు లాయర్. ఇరుపక్షాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు.. రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు చేసింది.. మరోవైపు రాజాసింగ్ విచారణ సందర్భంగా నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.. రాజాసింగ్ అనుకూల, వ్యతిరేక వర్గాలు.. కోర్టు ఎదుట ఆందోళన చేపట్టాయి.. కొందరు అనుకూలంగా నినాదాలు చేస్తే.. మరికొందరు వ్యతిరేకంగా నినదించారు.. దీంతో, ఇరు వర్గాలను చెదరగొట్టారు పోలీసులు.. ఇక, చంచల్ గూడ జైలు వద్ద ఉద్రిక్తత నెలకొంది.. జైలు వైపుకు దూసుకొచ్చారు రాజాసింగ్ వ్యతిరేక వర్గీయులు… రాజా సింగ్ దిష్టిబొమ్మతో ఆయనకు వ్యతిరేకంగ నినాదాలు చేశారు.. ఇక, రాజాసింగ్ వ్యాఖ్యలపై సీరియస్ అయిన బీజేపీ అధిష్టానం.. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.. అసలు ఎందుకు పార్టీ నుంచి బహిష్కరించకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది బీజేపీ అధిష్టానం.