BJP MLA Raja Singh Fired on KTR.
కేంద్రంపై ఏడ్వటం తప్ప మీరు సాధించిందేమిటని బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్ అన్నారు. గురువారం ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణకు 7 ఏళ్లలో రూ.3.30 లక్షల కోట్లకుపైగా కేంద్రం నిధుల మంజూరు చేసిందని, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి నిధులన్నీ కేంద్రానివేనని ఆయన అన్నారు. బహిరంగ చర్చకు బీజేపీ సిద్ధం.. గంగులపై పోటీకి బీజేపీ కార్యకర్త చాలు… చిత్తుగా ఓడించి తీరుతామని ఆయన సవాల్ విసిరారు. బండి నిప్పు కణం… సంజయ్ పేరు వింటేనే కేసీఆర్ వెన్నులో వణుకు పుడుతోందని ఆయన అన్నారు. మాటలకు… చేతలకు పొంతనలేని దద్దమ్మ కేటీఆర్ అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు.
ఈరోజు కరీంనగర్ లో మంత్రి కేటీఆర్ తెలంగాణకు కేంద్రం నయాపైసా ఇవ్వడం లేదని, బండి సంజయ్ కుమార్ గారు కరీంనగర్ ఎంపీగా ఉంటూ గత మూడేళ్లుగా కనీసం రూ.3 కోట్లు కూడా తేలేకపోయారంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అబద్దాలు చెప్పడంలో కేటీఆర్ వాళ్ల అయ్యను మించి పోయిండు. గత కొద్దిరోజులుగా నరం లేని నాలుక ఉంది కదా అని పచ్చి అబద్దాలు వల్లిస్తుండు. కేంద్రంపై విషం చిమ్ముతున్నడు. తెలంగాణకు కేంద్రం నిధులివ్వడం లేదంటున్నడు…. అధికారంలో ఉంటూ రాష్ట్రానికి టీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పకుండా…. కేంద్రంపై విమర్శలు చేయడం సిగ్గు చేటని ఆయన మండిపడ్డారు.