Raghunandan Rao: బీఏసీ సమావేశాలకు ఒక్కరున్నప్పుడు పిలిచారు.. ఇప్పుడు ముగ్గురున్నా పిలువరా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎందుకు బీజేపీ ఎమ్మెల్యేలను బీఏసీ సమావేశానికి స్పీకర్ పిలవలేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. అయితే.. రాజాసింగ్ ఒక్కరున్నప్పుడు బీఏసీ సమావేశానికి పిలిచారని.. ఇవాళ బీజేపీకి ముగ్గురు సభ్యులున్నప్పుడు ఎందుకు పిలవడంలేదని ఆయన ప్రశ్నించారు. ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే బీఏసీ సమావేశానికి పిలుస్తారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. అంతమందిని ఈ అసెంబ్లీ పదవీ కాలంలోపే తెచ్చుకుంటామని రఘునందన్ రావు ఎద్దేవ చేశారు. ఇక టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కలిసి మూడు రోజుల్లో సభను ముగించాలనుకుంటున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. ఎప్పుడూ లేని విధంగా.. గతంలో కూడా ఇదే విషయమై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి వివరించామని.. అయినా తమని బీఏసీ సమావేశానికి పిలవలేదని తెలిపారు. ఇక సీఎం చెప్పినట్లుగా స్పీకర్ నడుచుకుంటున్నారని రఘునందన్ రావు ఆరోపించారు.
బీఏసీని సంప్రదించకుండా 3 రోజులకె పరిమితం చేశారని, ఇది కేసీఆర్ అహంకారనికి నిదర్శనమని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మండిపడ్డారు. గన్ పార్క్ అమరవీరుల స్థూపం, అసెంబ్లీ ముందు ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్ నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ ప్రజానీకం 2 వ సారి అధికారం కట్టబెట్టిన తరువాత శాసనసభ సమావేశాలు మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని అన్నారు. శాసన సభ్యులను గడ్డి పోచల్లగా అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాలు 2- 3 రోజులకే పరిమితం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. పోయినసారి బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం లేకపోవడం పై అడిగినందుకు మమ్మల్ని అకారణంగా సస్పెండ్ చేశారని అన్నారు. చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. మాకు వినతులు వస్తున్నాయని ఈటెల తెలిపారు.
Dengue Danger Bells: ఏజెన్సీపై డెంగీ పడగ.. ఆస్పత్రుల్లో బెడ్ లు నిల్
Also Read
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
- Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- South Central Railway : మౌలాలిలో రైళ్లకు బ్రేక్.. డీజిల్ ఇంజిన్లతో రంగంలోకి రైల్వే.!
- Tags
- assembly
- bjp
- kcr
- MLA
- raghunanadan rao
తాజావార్తలు
-
SS Rajamouli-Varanasi: జక్కన్న లెక్కలు మారాయి.. ‘వారణాసి’ ఆ మార్క్ అందుకుంటుందా?.. ఇప్పటివరకు ఒకే ఒక్క మూవీ!
-
Love And War : ‘లవ్ అండ్ వార్’ను విడిచిపెట్టని లీక్స్
-
The Paradise : ఈరోజు నుండి నాని సినిమా అసలు రంగు ఏంటో తెలియనుందా?
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
World Rabies Day 2026: కుక్క కాటు నుంచి ఎలా తప్పించుకోవాలి?.. WHO సూచించిన ముఖ్యమైన జాగ్రత్తలు
ట్రెండింగ్
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!