Raghunandan Rao: గతంలో స్పీకర్ ను ఉద్దేశించి పోచారం మాట్లాడిన రికార్డ్స్ మా దగ్గర ఉన్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతంలో స్పీకర్ ను ఉద్దేశించి పోచారం మాట్లాడిన రికార్డ్స్ మా దగ్గర ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సర్దుకునే లోపే అసెంబ్లీ ప్రారంభం అయ్యింది… వాయిదా పడిందని విమర్శించారు. బీఏసీ మీటింగ్ కి మమ్మల్ని ఆహ్వానించక పోవడంపై స్పీకర్ ను పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేశామని తెలిపారు. గతంలో ఒకరు, ఇద్దరు సభ్యులుగా ఉన్న పార్టీ లను బీఏసీ మీటింగ్ కి పిలిచారని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ పిలిచారని అన్నారు. సభ గౌరవాన్ని పెంచాలని విజ్ఞప్తి కోరామన్నారు. ఎంత మంది సభ్యులు ఉంటే బీఏసీకి పిలవాలో రూల్స్ ఉంటే చెప్పండని ప్రశ్నిచారు. శాసన సభ వ్యవహారాల మంత్రి, స్పీకర్ చెప్పాలని కోరారు.
గతంలో ఉన్న సంప్రదాయాలు పాటిస్తారా లేదా? అంటూ ప్రశ్నించారు. రఘునందన్ రావు. గతంలో స్పీకర్ ను ఉద్దేశించి పోచారం మాట్లాడిన రికార్డ్స్ మా దగ్గర ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేసారు. మీరిచ్చే నోటీస్ లు చట్ట బద్ధంగా ఎదుర్కొనేందుకు సిద్ధమని తెలిపారు. మరమనిషి అనే పదం ఎమైన నిషేధిత పదమా? అంటూ ప్రశ్నించారు. ఏదో కారణంతో సభ నుండి బయటకు పంపించాలి అని చూస్తున్నారని మండిపడ్డారు. మాముఖం చూడటం ఇష్టంలేకపోతే.. ఏ నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి.. ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామన్నారు.
Also Read
సమస్యల మాట్లాడకుండా గొంతు నొక్కాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 రోజుల సభ జరగక పోతే మేము సభకు రామని భట్టి ఎందుకు డిమాండ్ చేయలేదని ప్రశ్నించారు. బీజేపీనీ ఆహ్వానించాలని MIM ఎందుకు అడగలేదు లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. ఎవరినో వ్యక్తిగతంగా అవమానించాలని మాకు లేదని స్పష్టం చేశారు. మొన్న నిజామాబాద్ లో ప్రశాంత్ రెడ్డి నీకు స్పీకర్ కు మధ్య జరిగింది ఏందో ఒక సారి చెప్పు? అని ప్రశ్నించారు. స్పీకర్ ను అవమానించింది మీరు, ప్రశాంత్ రెడ్డి అంటూ విమర్శించారు.
తాజావార్తలు
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
-
BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు!
-
Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
-
India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!