BJP MLA Etela Rajender: కేసీఆర్ దృష్టిలో బానిసలు లీడర్స్.. ఆత్మాభిమానం ఉన్నవాళ్లు కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MLA Etela Rajender Counter To CM KCR: టీఆర్ఎస్ నేతలు తనపై చేస్తున్న వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్పందించారు. తన సవాల్‌ని సీఎం కేసీఆర్ స్వీకరించలేక.. తన బానిసలతో ప్రెస్‌మీట్‌లు పెట్టించి తిట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈరోజు మాట్లాడుతున్న కేసీఆర్ బానిసలందరూ ఓసారి తమ గతం గురించి గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలోచించాలని కోరారు. చెన్నూరు ఎమ్మేల్యేకు మనసు గాయపర్చడం తప్ప ఏమీ తెలియదన్నారు. బెయిల్ ఆలస్యమైనప్పుడు, ఆయన కేసీఆర్‌ను బూతులు తిట్టిన వ్యక్తి అని.. తానే ఆయనకు బెయిల్ తెచ్చానని గుర్తు చేశారు. ఇంకొకరికి టికెట్ ఇస్తే.. ఓడిపోయి టీఆర్ఎస్‌నే తిట్టాడని ఈటెల పేర్కొన్నారు.
తానేమీ వార్డ్ మెంబర్‌గా, సర్పంచ్‌గా పోటీ చేయలేదని.. ఎమ్మేల్యే అయ్యేందుకు టీఆర్ఎస్ పార్టీలోకి రాలేదని ఈటెల రాజేందర్ తెలిపారు. కెసిఆర్ దృష్టిలో బానిసలు లీడర్లని, ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు కాదని చెప్పారు. 2018 ఎనికల్లోనే తనని ఓడించే ప్రయత్నం చేశారని.. తనతో పాటు మహబూబ్ నగర్‌లో ఒకరిని, ఖమ్మంలో ఇంకొకరిని, కరీంనగర్‌లో మరొకరిని ఓడించేందుకు కసరత్తులు చేశారని కుండబద్దలు కొట్టారు. నేను ఉద్యమంలో పని చేయలేదా? అని నిలదీసిన ఈటెల.. కుట్ర పూరితంగా తనని బయటకు పంపించారని ఆరోపించారు. హుజూరబాద్ ఉప ఎన్నికలో ఈటెల గెలిస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని ఒకరు సవాల్ చేశారన్నారు. ఇంకొక ఎమ్మెల్యే షార్ట్‌లు వేసుకొని చిల్ల వేషాలు వేశాడని, అతని క్యారెక్టర్‌పై ఆరోపణలూ వచ్చాయని ఈటెల రాజేందర్ చెప్పారు.
Also Read
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!