Munugode Bypoll Results: బీజేపీ ఆశలు గల్లంతు.. ఇలా జరిగిందేంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి.. రౌండ్ రౌండ్‌కి ఫలితాలు మారిపోతున్నాయి.. తొలిరౌండ్ నుంచి ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి… రెండో రౌండ్, మూడో రౌండ్, నాల్గో రౌండ్లో బీజేపీకి టీఆర్ఎస్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చినా.. మొత్తంగా మాత్రం నాల్గో రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్కు 613 ఓట్ల మెజార్టీ లభించింది.. అయితే.. చౌటుప్పల్లపై భారీగా ఆశలు పెట్టుకున్నారు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి… కానీ, రాజగోపాల్ రెడ్డి ఆశలను గల్లంతు చేశారు చౌటుప్పల్ ఓటర్లు.. భారీ మెజార్టీ ఆశించిన బీజేపీకి గట్టి షాక్ తగిలినట్టు అయ్యింది. అయితే ఇదే సమయంలో చౌటుప్పల్ ప్రాంతంలో బాగా పుంజుకుంది టీఆర్ఎస్ పార్టీ..
Read Also: Rajagopal Reddy: నేను అనుకున్న మోజారిటీ రాలేదు..
Also Read
ఇక, నాల్గో రౌండ్ ముగిసిన తర్వాత కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.. మీడియాతో మాట్లాడుతూ.. చౌటుప్పల్ మండలంలో మేం అనుకున్న మెజార్టీ రాలేదన్నారు.. ఇప్పటివరకైతే టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉందన్న ఆయన.. రౌండ్ రౌండ్‌కు ఫలితాలు మారుతున్నాయన్నారు.. చివరి వరకు హోరాహోరి పోరు తప్పక పోవచ్చన్న ఆయన… మొత్తంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందనే నమ్మకం మాత్రం తనకు ఉందన్నారు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. మొత్తంగా బీజేపీ అంచనాలు తలకిందులయ్యాయి.. చౌటుప్పల్ మండలంపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్న ఆ పార్టీకి నిరాశ తప్పలేదు.. అర్బన్ ప్రాంతంలో 5 వేల మెజార్టీ వస్తుందని లెక్కలేసుకున్న రాజగోపాల్ రెడ్డికి.. షాక్ తగిలినట్టు అయ్యింది.
తాజావార్తలు
-
Google Pixel 11 Series: భారత్‌లో గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ గ్రాండ్ లాంచ్.. ధరలు, ఫీచర్ల పూర్తి వివరాలు..
-
Irumbudi Trailer: రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ .. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అంటున్న మేకర్స్
-
Astrology: ఆగస్టు 13 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధనలాభం..!
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..