Site icon NTV Telugu

వరి ఉరి కాదు.. రైతుల పాలిట సిరి..

NVSS Prabhakar

వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో గందరగోళ పరిస్థితులతో రైతు కన్నీరు పెడుతున్నాడు.. ధాన్యం మార్కెట్‌కు తరలించినా ఎప్పుడు కొంటారో తెలియని పరిస్థితి.. మరోవైపు వర్షాలతో కల్లాలు, రోడ్లపైనే ధాన్యం తడిసిసోయి రైతులను కన్నీరు పెట్టిస్తుంది.. అయితే, వరి ఉరి కాదు.. రైతుల పాలిట సిరి అంటున్నారు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్.. వరి విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని విమర్శించిన ఆయన.. వానాకాలం పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని.. రైతుల ఆత్మహత్యలకు సీఎం కేసీఆర్ దే బాధ్యత అన్నారు. రైతులతో చెలగాటం ఆడుతున్నారు. ధాన్యం దళారీలకు అమ్ముకోవాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. వరి ఉరి కాదు రైతుల పాలిట సిరి.. రబీలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వరి పంటను కొనాల్సిందేనని డిమాండ్ చేశారు.

Read Also: బిడ్డ కోసం చిరుతతో పోరాటం.. తల్లి ప్రేమ ముందు తోకముడిచిన క్రూరమృగం..

ఇక, సీఎం కేసీఆర్ రైతుల పాలిట రాబంధులా తయారయ్యారని ఆరోపించిన ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్.. వ్యవసాయ మంత్రికి ఏ పంట ఎప్పుడు వస్తుందో ఇంగిత జ్ఞానం ఉందా ? అంటూ ఫైర్‌ అయ్యారు.. వ్యవసాయం గురించి తెలియని కేటీఆర్‌ కూడా మాట్లాడుతున్నాడు అంటూ సెటైర్లు వేశారు. మరోవైపు ఆర్టీసీ చార్జీల పెంపు ప్రతిపాదనపై స్పందించిన ప్రభాకర్.. ఆర్టీసీ చార్జీల పెంపు ప్రతిపాదనను బీజేపీ వ్యతిరేకిస్తుందన్నారు.. ప్రతిపాదనలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఆస్తులని టీఆర్ఎస్‌ నేతలు అతి తక్కువ ధరలకు లీజులకు తీసుకున్నారని ఆరోపించిన ఆయన.. ఆ లీజులను ప్రస్తుత మార్కెట్ ధరలకు పెంచాలని.. ఆర్టీసీ వాడే డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాలని సూచించారు.

Exit mobile version