NTV Telugu Site icon

Telangana Politics: సొంత గూటికి కోమటిరెట్టి రాజగోపాల్ రెడ్డి..

Untitled 2

Untitled 2

Telangana Politics: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జోరు పెరిగింది. ఎన్నికల ముహూర్తం సమీపిస్తుండడంతో రాష్ట్రంలో పార్టీల మధ్య నేతల బదిలీలు ఊపందుకున్నాయి. ఇప్పటికే చాలామంది ఉన్న పార్టీ నుండి మరో పార్టీకి మకాం మార్చేశారు. అయితే తాజాగా బీజేపీ నేత కోమటిరెట్టి రాజగోపాల్ రెడ్డి కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా గతంలో కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన ఈయన ఆ తరువాత బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. బీజేపీ పార్టీ తరుపున పోటీ చేయగా ప్రత్యర్థి అయినటువంటి బీఆర్ఎస్ అభ్యర్ధి చేతిలో పరాజయం పొందారు. అప్పటి నుండి బీజేపీ పార్టీలో అంత చురుకుగా లేని రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకుని సొంతగూటికి చేరారు.

Read also:Telangana Elections 2023: ఏది కావాలి మనకు?.. ఆలోచించు తెలంగాణ రైతన్నా: కేటీఆర్‌

నిజానికి ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరాల్సి ఉంది. కాగా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ప్రారంభం కాకముందే పార్టీ లో సభ్యత్వం ఉండాలి అనే సాంకేతిక కారణం చేత హడావిడిగా.. నిన్న అనగా గురువారం రాత్రి తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిల సమక్షంలో పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే కండువా కప్పగా రాత్రికి రాత్రే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కాగా ఈ రోజు ఉదయం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో అధికారికంగా చేరనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను ఎదుర్కొనే సత్తా కేవలం కాంగ్రెస్ కి మాత్రమే ఉందని.. కేసీఆర్ అవినీతిని బీజేపీ అడ్డుకోలేక పోయిందని.. అందుకే తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నట్టు రాజగోపాల్ రెడ్డి తెలిపారు.