Site icon NTV Telugu

DK Aruna: బంగారు భవిష్యత్తు కావాలంటే.. బీజేపీ అధికారంలోకి రావాలి

Dk Aruna

Dk Aruna

బంగారు భవిష్యత్తు కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ అన్నారు. జులై 2 ,3 వ తేదీన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం సంద‌ర్భంగా ఆమో మీడియాతో మాట్లాడారు. జాతీయ కార్యవర్గ సమావేశాలు పనులు ప్రారంభం ఆయ్యాయని తెలిపారు. మోడి తో పాటు బీజేపీ ముఖ్యమంత్రులు, జాతీయ పదధికారులు,కేంద్ర మంత్రులు పాల్గొన్నారని పేర్కొన్నారు. 3 వ తేదీన కార్యవర్గ సమావేశం ముగిసిన అనంతరం ఫెరడ్ బీజేపీ బహిరంగ సభ వుంటుంద‌ని డీకే అరుణ తెలిపారు. ఆ సభ కి మోడీ తో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారని అన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు సభకి రానున్నార‌ని డీకే అరుణ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. కేసీఆర్ అధికారం లోకి నియంత పాలన నడుస్తుందని మండిప‌డ్డారు.

బంగారు కుటుంబంగా మిగిలింది కేసీఆర్ కుటుంబం మాత్ర‌మే న‌ని విమ‌ర్శించారు. అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీలు ,డబుల్ బెడ్ రూమ్, నిరుద్యోగ భృతి, దళితులకు భూమి అన్నారు. దళిత బంధు పేరుతో ప్రజలను మోసం చేయడానికి పూనుకున్నారని ఎద్దేవ చేశారు. కేసీఆర్ పై ప్రజలు విశ్వాసం కోల్పోయారని డీకే అరుణ అన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న‌ మోడీనే అని పేర్కొన్నారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ తో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రజలు కోరుతున్నారని అన్నారు. తెలంగాణ తల్లికి కేసీఆర్ బేడీలు వేశారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రజాస్వామ్య పాలన ప్రజలు కోరుకున్నారని అన్నారు. ప్రజల ఆకాంక్షకి అనుగుణంగా బీజేపీ ముందుకు వెళ్తుందని తెలిపారు. అగ్నిపథ్ విషయంలో ప్రజలను ప్రతి పక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నారని డీకే అరుణ ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు.

Relationship: ఎంత ఘాటు ప్రేమయో..! గర్ల్‌ఫ్రెండ్‌ కోసం ఆయనగా మారిన ఆమె..!

Exit mobile version