Lok Sabha Results 2024: 5వ రౌండ్: నిజామాబాద్ జిల్లాలో 5వ రౌండ్ ముగిసే సరికి 38500 వేల ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ముందంజలో వున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ లో అధిక్యంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ దూసుకెళ్తున్నారు. ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, కోరుట్ల లో బీజేపీ ఆధిక్యంలో వున్నారు. జగిత్యాల, బోధన్ లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి స్వల్ప ఆధిక్యంలో వున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి బాజీరెడ్డి గోవర్ధన్ డిపాజిట్ గల్లంతు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక మహబూబ్ నగర్ పార్లమెంట్ 2వ రౌండ్ 2493తో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. కాంగ్రెస్ ( వంశీ చంద్ రెడ్డీ ) 49544 కాగా.. బీజేపీ ( డీకే అరుణ ) 52137కాగా.. DK అరుణ 2493 ముందంజలో వున్నారు. ఆదిలాబాద్ ఎంపీ స్థానంలో 5 వ రౌండ్ లో బీజేపీ ముందంజలో వున్నారు. లీడ్ లో బిజేపీ కొనసాగుతుంది. మరవైపు వరంగల్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ మూడవ రౌండ్ ముగిసేసరికి బీజేపీ- 62384, కాంగ్రెస్- 96906, బీఆర్‌ఎస్ – 42874కాఆ.. 34522 ఓట్ల ఆదిత్యంలో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య ముందంజలో వున్నారు.