NTV Telugu Site icon

Bandi Sanjay: గవర్నర్ పై బీజేపీ ముద్రవేసి అవమానిస్తున్నారు.. సంచలన ట్వీట్..

Bandi Sanjay

Bandi Sanjay

గవర్నర్ తమిళిపై వాస్తవాలు మాట్లాడారని బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ అన్నారు. గవర్నర్ వ్యవస్థను టీఆర్ఎస్ కించపరుస్తోందని ఆరోపించారు. ఆమెపై బీజేపీ ముద్ర వేసి అవమానిస్తున్నారని చెప్పారు. కల్వకుంట్ల రాజ్యాంగం బ్యాచ్ నుంచి అంతకంటే ఎక్కువ ఆశించలేమని మండిపడ్డారు మంచి పడ్డారు. టీఆర్‌ఎస్‌ గొర్రెలు మహిళలను గౌరవించడం గానీ, బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని పాటించడం గానీ చేయడం లేదని మండిపడ్డారు.
కల్వకుంట్ల రాజ్యాంగ ప్రతిపాదకుల నుంచి ఇంకా ఏం ఆశించగలం? అని ఎద్దేవ చేశారు. గౌరవనీయులైన తెలంగాణ గవర్నర్ భారత రాజ్యాంగం యొక్క ఆదర్శాలను అమలు చేయాలని, గవర్నర్ కార్యాలయాన్ని గౌరవించాలని, ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉండాలని అడుగుతున్నారని అన్నారు. గవర్నర్ తమిళసై వాస్తవాలను మాట్లాడారని బండి సంజయ్ అన్నారు. కానీ టీఆర్‌ఎస్‌ గవర్నర్‌ను బీజేపీ వ్యక్తిగా ముద్రవేసి, టీఎస్‌ ప్రథమ పౌరుడిని అవమానిస్తోంది. అవమానమని ట్విటర్ వేదికగా మండిపడ్డారు బండిసంజయ్.

నిన్న రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసిన విషయం తెలిసిందే. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌పై మంత్రులు జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ గవర్నర్‌గా మూడేళ్ల పదవీ కాలాన్ని ముగించుకున్న నేపథ్యంలో గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ తెలంగాణ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో మంత్రులు గవర్నర్‌పై మండిపడ్డారు.

ముఖ్యమంత్రిపై, ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం గవర్నర్‌కు ఫ్యాషన్‌గా మారిందని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. ఇది సరైనది కాదన్న ఆయన.. నిత్యం వార్తల్లో ఉండేందుకే గవర్నర్ ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాజ్‌భవన్‌ను ఉపయోగించుకుని గవర్నర్ బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజ్యాంగబద్ధ సంస్థలను గౌరవించడంలో కేసీఆర్ వంటి పరిణతి చెందిన నాయకుడు మరొకరు లేరన్నారు. గౌరవంగా రాజ్‌భవన్‌ను నడపాల్సిన గవర్నర్ రాజకీయాలు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. దేశంలో ప్రధాని, రాష్టపతి తరహాలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా పాలన సాగుతుందన్నారు.

మరోవైరు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గవర్నర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గవర్నర్ తమిళిసై హూందా తనాన్ని కోల్పోతున్నారని ఆయన అన్నారు. గౌర‌వ‌నీయ‌మైన గవర్నర్ వ్యవస్థను చెడగొడుతున్నారని ఆయన అన్నారు. గవర్నర్‌గా ఆమె చేష్టలు ప్రజలను బాధపెడుతున్నాయన్నారు. తమిళిసై రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలా వ్యవహరిస్తూ, బీజేపీ నాయకులతో సమావేశాలు, చర్చలు జరుపుతున్నారని ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థను కించపరుస్తుండ‌టం వల్లనే తమిళిసైకి త‌గిన‌ గౌరవం దక్కడం లేదన్నారు. గవర్నర్ తమిళిసైని తెలంగాణ ఆడపడుచులా చూసుకున్నామన్నారు. కానీ ఆమె బీజేపీ డైరెక్షన్‌లో పని చేస్తున్నారని మండిపడ్డారు.
CUET UG Results 2022: సెప్టెంబర్‌ 15 నాటికి కామన్ యూనివర్శిటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు

Show comments