Telagnana BJP: రాష్ట్రీయ జనతా పార్టీకి చెందిన తెలంగాణ నేతలు నేడు న్యూఢిల్లీకి వెళ్లనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. ఈ సమావేశంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు దాదాపు 100 మంది ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల కోసం అభ్యర్థులను బీజేపీ ఫైనల్ చేయనుంది. కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, జేపీ నడ్డా, అమిత్ షాలు పాల్గొననున్నారు. తొలి జాభితాలోనే తెలంగాణ అభ్యర్థుల ప్రకటించనున్నారు. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు 10 మంది అభ్యర్థులకు సీటు దక్కే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ దక్షిణాదిపై దృష్టి సారించింది. భారతీయ జనతా పార్టీ ఈసారి దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువ ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని యోచిస్తోంది. 2019 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. ఈసారి కనీసం రెండంకెల సీట్లు సాధించాలని ఆ పార్టీ యోచిస్తోంది.
Read also: TS sheep Scam: గొర్రెల పంపిణీ స్కాం.. ఏసీబీ కస్టడీలో ఆ నలుగురు..!
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క అసెంబ్లీ సీటును మాత్రమే గెలుచుకుంది. అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఈ దఫా పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం పది ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని పార్టీ యోచిస్తోంది. తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ దృష్టి సారించింది. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆ పార్టీ యోచిస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా పార్లమెంట్ ఎన్నికల్లో మరిన్ని ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల నుంచి బీజేపీ నాయకత్వం విజయయాత్ర ప్రారంభించింది. ఈ యాత్రల ముగింపు సందర్భంగా ఈ ఏడాది మార్చి 4, 5 తేదీల్లో రాష్ట్రంలో నిర్వహించే బీజేపీ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. గతేడాది తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ విస్తృతంగా పర్యటించిన సంగతి తెలిసిందే.
Yarlagadda VenkatRao: యార్లగడ్డ ఉదారస్వభావం.. సొంత ఖర్చుతో కుట్టు మిషన్ల పంపిణీ..