ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 17వ తేదీ రోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన కోటి వృక్షార్చన పిలుపు మేరకు భూపాలపల్లిలో సింగరేణి డైరెక్టర్ బలరాం ఐ.ఆర్.ఎస్ గారు మియావాకి పద్దతిలో తక్కువ ప్రదేశంలో చిట్టి అడవి సృష్టించే విధంగా మొక్కలు నాటడం జరిగింది. ఆ ప్రదేశంలో ఆ మొక్కలు పెరిగి పెద్దగా అయి ఈరోజు వివిధ రకాల పక్షులకు , కిటలాకు నిలయంగా మారి ఆ చెట్లపై గుళ్ల ను ఏర్పరచుకొని వాటిలో గ్రుడ్ల ను పెట్టి కొత్త పక్షులను జననం ఇవ్వడం జరుగుతుంది.
ఈ విధంగా మనం పెట్టిన మొక్కలు పక్షులకు, కీటకాలకు ఆవాస కేద్రంగా ఉండి అంతరించి పోతున్న వివిధ రకాల జాతుల పక్షులకు, కీటకాలకు నిలయంగా మారాయని పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటే అంతరించిపోతున్న జీవులు మళ్లీ మనం చూసే వీలు కలుగుతుంది. వీటిని చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉందని , ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టిన రోజు సందర్భంగా నాటిన మొక్కలు పెరిగి పెద్దవిగా అయి పక్షులకు, కీటకాలకు నిలయంగా మారడం చాలా సంతోషంగా ఉందని.ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కి మనం ఇస్తున్న అద్భుతమైన కానుక అని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు తన ట్విట్టర్ వేదిక ద్వారా అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు.
మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత తీసుకున్న సింగరేణి డైరెక్టర్ బలరాం గారికి అభినందనలు తెలియజేశారు.