Bike Mechanic Turns Thief For Woman: అతడు ఒక బైక్ మెకానిక్. ఎంచక్కా బైక్స్‌కి రిపేర్ చేస్తూ.. హ్యాపీగా తన జీవితాన్ని సాగిస్తుండేవాడు. అంతా సవ్యంగా సాగుతున్న క్రమంలో.. అతని జీవితంలోకి ఒక మహిళ వచ్చింది. అంతే, అప్పటి నుంచి అతని జీవితం ఒక్కసారిగా తిరగబడింది. ఒక్కొక్కటిగా కష్టాలు రావడం మొదలయ్యాయి. చెడువాసాలకు కూడా అలవాటు పడ్డారు. ఆ మహిళను పోషించేందుకు.. దొంగగా కూడా మారాల్సి వచ్చింది. చివరికి పోలీసులకు పట్టుబడి, కటకటాలపాలయ్యాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్‌లోని హసన్ నగర్‌కు అస్లం ఖాన్.. ఒక బైక్ మెకానిక్ తన జీవనం కొనసాగిస్తున్నాడు. మూడు పువ్వులు ఆరు కాయలుగా.. తన జీవితాన్ని హ్యాపీగా గడుపుతుండేవాడు. అప్పుడే అతని జీవితంలోకి ఒక మహిళ వచ్చింది. మొదట కళ్లు, ఆ తర్వాత మనసులు కలవడంతో.. ఆమెతో సహజీవనం చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే అస్సం చెడువాసాలకు అలవాటు పడ్డాడు. దీంతో.. అతని జీవితంలో కష్టాలు రావడం మొదలయ్యాయి. చాలీ చాలని జీతంతో.. ఒకవైపు సహజీవనం చేస్తోన్న మహిళను పోషించడం, మరోవైపు కష్టాల్ని పూడ్చడం అతనికి భారమైపోయింది. ఏం చేయాలో అతనికి ఎటూ తోచలేదు. అప్పుడే అతడు అడ్డదారిని ఎంచుకున్నాడు. డబ్బులు సంపాదించేందుకు, దొంగగా మారాలని అనుకున్నాడు.
మొదట ఓ బైక్ దొంగతనం చేసిన అస్లం ఖాన్, దాన్ని అమ్మేశాడు. పోలీసులకు దొరక్కపోవడంతో, ఇక వరుసగా దొంగతనం చేయడం ప్రారంభించాడు. చార్మినార్ బస్టాండు, గుల్జార్ హౌస్, ఇంకా ఇతర ప్రాంతాల్లో పార్క్ చేసి ఉన్న వాహనాల్ని టార్గెట్ చేసి.. దొంగతనాలకు పాల్పడ్డాడు. ఇటీవల హుసేని ఆలం అనే వ్యక్తి తన బైక్ చోరీ అయ్యిందని కేసు పెట్టగా.. పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే వాహనాల చెకింగ్ నిర్వహించినప్పుడు.. అస్లం ఖాన్ పట్టుబడ్డాడు. తమదైన శైలిలో విచారించగా.. తన నిజాన్ని కక్కేశాడు. అతని వద్ద నుంచి 11 వాహనాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.