సికింద్రాబాద్ పరిధిలోని బోయిగూడ అగ్నిప్రమాదంపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రమాద ఘటనను త్రీడీ స్కానర్తో పరిశీలించిన ఫైర్ సేఫ్టీ, క్లూస్ టీమ్స్ కీలక ఆధారాలు సేకరించాయి. 11 మంది కార్మికులు సజీవదహనం కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికీ గోదాం యాజమానిలో ఒకరి అరెస్ట్ చేయగా, మరొకరు పరారీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే పలు కీలక ఆధారాలను ఫైర్ సేఫ్టీ, క్లూస్ టీమ్స్ సేకరించింది. షార్ట్ సర్క్యూట్‌తో ఎగిసిపడ్డ నిప్పు రవ్వలే ప్రమాదానికి కారణమని అంచనా వేస్తున్నారు. స్క్రాప్ గోదాంలో అంటుకున్న మంటల ద్వారా కరెంట్ బోర్డులకు వ్యాపించి, పేలిన సిలిండర్, కరెంట్ ఫ్యూజ్‌లతో ప్రమాదం మరింత ప్రమాదం చోటు చేసుకుందని భావిస్తున్నారు.
ఒక్కో ఫ్యూజ్‌లో అదనంగా మందమైన వైర్లు ఉన్నట్లు గుర్తించారు. కేబుల్ వైర్లు, ప్లాస్టిక్ వైర్లపై నిప్పురవ్వలు పడడంతో ప్రమాదం జరిగిందని, గోదాంలో 10కి పైగా స్విచ్ బోర్డులు ఉన్నట్లు, షార్ట్ సర్క్యూటే కారణంగా గోదాంలో మంటలు చెలరేగినట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. ముందుగా గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఇనుప మెట్ల వద్ద ప్రమాదం చోటచేసుకున్నట్లు, ఇనుప మెట్లు ఉండటంతో కిందకు రాలేక 11 మంది సజీవదహనమైనట్లు సమాచారం. అయితే గాఢ నిద్ర సమయంలో దట్టమైన పొగ వల్ల కార్మికులు స్పృహ కోల్పోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. భారీ పేలుళ్లతో సిమెంట్ రేకులు తునాతునకలయ్యాయి. గోదాం కింద భాగంతో పాటు పైఅంతస్తులో కూడా సిలిండర్లు పేలుళ్లు జరిగినట్లు క్లూస్ టీమ్ ఆధ్వర్యంలో త్రీడీ స్కానర్ల ద్వారా విచారణ చేపడుతున్నారు.