భక్తి టీవీ కోటిదీపోత్సవం నిర్వహించడం సామాన్యులు చేయడానికి అవకాశం లేని కార్యక్రమం అన్నారు తెలంగాణ కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టివిక్రమార్క. పీఠాధిపతులను పిలిచి అద్భుతమయిన ప్రసంగాలను అందిస్తున్నారన్నారు. భక్తిభావంతో అంతా క్షేమంగా వుండాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆశీస్సులు అందించడం హర్షణీయం అన్నారు. సమాజ కళ్యాణానికి, భక్తి భావం పెంచడానికి భక్తి టీవీ కోటిదీపోత్సవం అద్భుతంగా నిర్వహించడం అభినందనీయం అన్నారు మల్లు భట్టివిక్రమార్క.
హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో లక్షలాదిమంది భక్తులు కోటి దీపోత్సవంలో పాల్గొనడం సంతోషంగా వుందన్నారు. నన్ను కూడా ఈమహాకార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరడం అద్భుతంగా ఉందన్నారు. మీ జీవితం ధన్యం, మీకోసం కాకుండా సమాజం కోసం ఆలోచించడం నిజంగా అభినందనీయం అన్నారు భట్టి విక్రమార్క. భక్తి టీవీ కోటిదీపోత్సవం 9వ రోజు కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు భట్టి విక్రమార్క. గత నెల 31వ తేదీన ప్రారంభం అయిన కోటి దీపోత్సవం నవంబర్ 14వ వరకూ కొనసాగనుంది.