Bhatti Vikramarka: మోడీ పర్యటన వల్ల తెలంగాణ కు ఉపయోగం లేదని సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే అని అన్నారు. మోడీ పర్యటన వల్ల తెలంగాణకు ఉపయోగం లేదని అన్నారు. తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్నారు BRS సర్కార్ పై ఏమి చర్యలు తీసుకున్నారు? అని ప్రశ్నించారు. చర్యలు తీసుకోలేదని అంటే మోడీ అసమర్థుడు అనే కదా? అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్, బీజేపీ లు ఒప్పందములో భాగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారని భట్టి విక్రమార్క అన్నారు. సంజయ్ కేటీఆర్ ఢిల్లీ వెళ్లి వరంగల్‌లో జరిగిన బీజేపీ సమావేశంలో డీల్‌పై చర్చించిన తర్వాతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డిని నియమించారని అన్నారు. రాహుల్ తమ నాయకుడని.. ఆయన్ని ఏ హోదాలోవస్తారని ప్రశ్నించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ, కేసీఆర్ కలిసి దేశ, రాష్ట్ర వనరులను దోచుకుంటున్నారని ఆరోపించారు. కోట్లకు పడగలెత్తిన తెలంగాణకు న్యాయం చేయలేకపోయారన్నారని తెలిపారు.
Read also: Bandi Sanjay: వరంగల్‌లో బీజేపీ సభ.. ‘నా మోడీ’ అంటూ బండి ఎమోషనల్ స్పీచ్..
ప్రజల సంక్షేమానికి అడ్డుగా ఉన్న వారిని తొలగించాలన్నారు. పెట్టుబడిదారీ బీజేపీ, భూస్వామ్య బీఆర్‌ఎస్‌లను తెలంగాణ నుంచి తరిమి కొట్టాలన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఒక్కటే ప్రత్యామ్నాయమని భావిస్తున్నారని అన్నారు. ప్రజలకు ఏది దక్కుతుందో అది పాలకులకే చెందుతుందని ప్రజలు గుర్తించారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మరోవైపు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్ర రావు, సిటీ సెంటర్లోని వైయస్సార్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. పంజాగుట్ట సర్కిల్ లోని వైయస్సార్ విగ్రహాం వద్ద జరిగే జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గాంధీభవన్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొని సీఎల్పీ కార్యాలయంలో జరిగే వైఎస్ఆర్ జయంతి కార్యక్రమానికి హాజరయ్యారు.
Nadendla Manohar : ఈ ప్రభుత్వానికి స్పందించే గుణం లేదు