Bhatti Vikramarka: సీఎం, మంత్రులు అందుబాటులో లేని సెక్రటేరియేట్ ఎందుకు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka: సీఎం, మంత్రులు అందుబాటులో లేని సెక్రటేరియేట్ ఎందుకు..? అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నిక దొర తెలంగాణకు.. ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతోన్న యుద్దం అన్నారు. ముదిగొండ మండలం ఖానాపురం గ్రామంలో భట్టి కార్నర్ మీటింగ్ లో పలువురు బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భట్టి తెలంగాణ సీఎం కావాలంటూ ఖానాపూర్ గ్రామస్తుల ఆకాంక్ష అని అన్నారు. జలగం వెంగళరావు తర్వాత ఖమ్మం జిల్లా నుంచి భట్టికే అవకాశం ఉందన్న ఖానాపూర్ వాసులు తెలిపారు. ఖమ్మం జిల్లా మధిరలో ఎన్నికల ప్రచారంలో భట్టి మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చి పదేళ్లు కావస్తోన్నా.. సీఎం, మంత్రులు సెక్రటేరీయేట్టుకు రావడం లేదని అన్నారు. సీఎం, మంత్రులు అందుబాటులో లేని సెక్రటేరీయేట్ ఎందుకు..? అని ప్రశ్నించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు కుంగిపోతున్నాయని తెలిపారు. కాళేశ్వరం పేరుతో రూ. 1లక్ష కోట్లు.. మిషన్ భగీరధ పేరుతో రూ. 50 వేల కోట్లు నిరుపయోగం చేశారని అన్నారు. ప్రాజెక్టుల పేరుతో దోపిడీ జరుగుతోందని మేం గొంతు చించుకుని అరిచాం.. గళమెత్తామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వదిలించుకోకుంటే రాష్ట్రానికే భవిష్యత్తే ఉండడదని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించుదాం.. టీఆర్ఎస్ నేతలను దంచుదాం.. సంపదను ప్రజలకు పంచుదామన్నారు.
ఇళ్ల స్థలం ఇవ్వనున్నాం.. ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇవ్వనున్నామని తెలిపారు. రూ. 2 లక్షల రుణ మాఫీ ఇస్తామన్నారు. రైతులకే కాదు.. రైతు కూలీలను ఆదుకునే పథకాలు మేనిఫెస్టోలో పెట్టామన్నారు. ప్రతేడాది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోదాలిస్తామని తెలిపారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మధిర ప్రధాన భూమిక పోషించబోతోందని అన్నారు. పారిశ్రామికంగా మధిర అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్న టీడీపీ, సీపీఐ పార్టీలకు ధన్యవాదాలు అన్నారు. ప్రజలకు మేం గాలి మాటలు చెప్పడం లేదు.. సంతకాలతో కూడిన గ్యారెంటీ కార్డు ఇస్తున్నామన్నారు. విభజన తర్వాత తెలంగాణకు వచ్చిన సంపద అంతా దొరల దగ్గరికే వెళ్లిందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పేదలు పేదలుగానే మిగిలిపోయారు.. అలిసిపోయారన్నారు. నిరుద్యోగులు.. నిరుద్యోగులుగానే మిగిలిపోయారని తెలిపారు. దొరలపై పేదలు గెలవాలన్నారు. పేదలు గెలవాలంటే కాంగ్రెస్ గెలవడమే అని తెలిపారు. ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందన్నారు. విద్యార్థుల కోసం రూ. 5 లక్షల క్రెడిట్ కార్డు ఇస్తామని తెలిపారు. విద్యార్థినులకు బ్యాటరీ స్కూటర్ పంపిణీ చేస్తామన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వదిలించుకుందామని భట్టి తెలిపారు.
Hyderabad: స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి..
Also Read
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
- Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
తాజావార్తలు
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?