Bhatti Vikramarka : AIను పరిపాలనలో ఉపయోగించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ ఎదగాలి
- ఎంసీఆర్హెచ్ఆర్డీ గవర్నింగ్ బాడీ సమావేశంలో కీలక నిర్ణయాలు
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై భట్టి విక్రమార్క దృష్టి
- అధికారుల శిక్షణలో సమగ్ర ప్రణాళికలు
- స్వయం సహాయక సంఘాల శిక్షణ, ఆర్థిక పురోగతి లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka : ఎంసీఆర్హెచ్ఆర్డీ (మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ)లో శనివారం గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది. ఈ కీలక సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.
సమావేశానికి ఎంసీఆర్హెచ్ఆర్డీ వైస్ చైర్‌పర్సన్ శాంతి కుమారి, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్‌అండ్ బీ ఈఎన్‌సి జయ భారతి సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Also Read
- Rama Nandana: లగ్జరీ లైఫ్‌స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్‌కు లుకౌట్ నోటీసులు!
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Devji : లాసెట్‌లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ..
ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఎంసీఆర్హెచ్ఆర్డీని దేశంలోనే అత్యుత్తమ శిక్షణ సంస్థగా నిలపాలని ఆకాంక్షించారు. దీనికి ప్రభుత్వ పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. సంస్థ స్వయం సమృద్ధి సాధించి, ఆర్థికంగా పురోగమించాలని సూచించారు.
పరిపాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నొక్కిచెప్పారు. దేశంలోనే మొట్టమొదట పరిపాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను పూర్తిస్థాయిలో ఉపయోగించిన రాష్ట్రంగా తెలంగాణ ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. అందుకు తగిన విధంగా అధికారులకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి నుంచి గ్రామస్థాయి అధికారి వరకు అందరికీ సమగ్ర శిక్షణ అందించాలని సూచించారు.
అంతేకాకుండా, స్వయం సహాయక సంఘాల (Self-Help Groups) నాయకులకు జిల్లా, మండల స్థాయిల్లో రెండు రోజులపాటు శిక్షణ ఇచ్చి, వారు ఆర్థికంగా ఉన్నత స్థానానికి ఎదిగేందుకు కృషి చేయాలని భట్టి విక్రమార్క అన్నారు. గత పదేళ్లుగా ఎంసీఆర్హెచ్ఆర్డీపై తగినంత దృష్టి సారించలేదని పేర్కొన్న ఆయన, ఇకపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి సబ్-కమిటీ సమావేశం నిర్వహించబడుతుందని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్‌స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్‌కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..