కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కరకట్ట విస్తరణ చేయాల్సిందే అన్నారు. వైఎస్ హయాంలోనే కరకట్ట పటిష్టానికి నిధులు కూడా మంజూరు చేశారు. ప్రత్యేక రాష్ట్రంలో వైఎస్ మంజూరు చేసిన నిధులు విడుదల కూడా చేయలేదు. ఏపీలో తెలంగాణని కలపండి అని ఏపీ నేతలు చెప్పడంలో లాజిక్ లేదన్నారు. మూడువేల ఎకరాల ముంపునే మహారాష్ట్ర ఒప్పుకోలేదు. 2 లక్షల ఎకరాల ముంపు ను కెసిఆర్ ఎలా ఒప్పుకున్నాడన్నారు భట్టి. త్వరలో గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో కాంగ్రెస్ బృందం పర్యటిస్తుందన్నారు. త్వరలోనే తేదీలు ప్రకటిస్తాం అన్నారు భట్టి విక్రమార్క.
Kerala NEET exam issue: విద్యార్థినుల లోదుస్తులు విప్పించడంపై మహిళా కమిషన్ సీరియస్.. విచారణకు ఆదేశం
వరద వల్ల మునిగిపోయారు. నేనే ప్రభుత్వంలో ఉంటే… వరద ముంపుపై 24 గంటల్లో సమాధానం చెప్పేవాడినన్నారు. కేసీఆర్ చెప్పిన క్లౌడ్ బరస్ట్ స్టేట్మెంట్ చూస్తే… నవ్వాలో..ఏడ్వాలో తెలియడం లేదు. పాలకులు సీరియస్ గా సమస్యను తీర్చేలా ఉండాలి. జనాన్ని డైవర్ట్ చేసే రాజకీయం చేయొద్దన్నారు భట్టి. క్లౌడ్ బరెస్ట్ వ్యాఖ్యలపై భట్టి స్పందిస్తూ.. భారీ వరదల వెనుక విదేశీ కుట్ర ఉంటే.. కేంద్రానికి సీఎం కేసీఆర్ సమాచారం ఇవ్వాలన్నారు. సీఎం దగ్గర సమాచారం ఉంటే… కేంద్రం వచ్చి తెలుసుకుని పోవాలి. ఇద్దరూ అది చేయడం లేదన్నారు భట్టి. రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం జరుతుంటే నిద్ర లో ఉంది ప్రభుత్వం. కెసిఆర్ భద్రాచలంకి వంద కోట్లు ఇస్తా అన్నారు. ఇప్పుడు ఇంకో సున్నకలిపి వెయ్యి కోట్లు ఇస్తా అన్నారు. వంద కోట్లు లేవు..ఇప్పుడు వెయ్యి కోట్లు సంగతి అంతే. వెయ్యి కోట్లు మరమ్మత్తులకే సరిపోతాయి. వరద ముంపునకు శాశ్వత పరిష్కారం కోసం నిధులు సరిపోవన్నారు.
