హైదరాబాద్ నగర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రోహిత్ ను అరెస్ట్ చేయడం దారుణం అని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క అన్నారు. ఆయనతో పాటు ఇంకా కొంతమంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారని అన్నారు. ఆజాదీ కా అమృత్ ఉత్సవాల్లో దేశంలోని ప్రముఖుల ఫోటోలు లేవని ఆయన అన్నారు. ఆధునిక భారతదేశ నిర్మాణంలో కీలకంగా ఉండీ, స్వాతంత్ర్య సంగ్రామంలో దాదాపుగా దశాబ్ధకాలం జైలులో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ ఫోటో లేకుండా సాలార్ జంగ్ మ్యూజియంలో నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ ఉత్సవాలు కరెక్ట్ కాదని చెబుతున్న క్రమంలో అరెస్ట్ చేశారని బట్టి విమర్శించారు. 12 మందిని అరెస్ట్ చేసి కాంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ లో పెట్టడం దుర్మార్గం అని అన్నారు. టెట్ ఎగ్జామ్ పై మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతి ఇవ్వడానికి వెళ్లినందుకు రాష్ట్ర కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేత, ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు వెంకట్ తొో పాటు 21 మందిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో బంధించారని అన్నారు.
దేశ సంతంత్ర్య సంగ్రామంలో మహాత్మాగాంధీ, నెహ్రూ గారి ముద్ర ఉందని…వీరిద్దరు లేకుండా సంతంత్ర్య సంగ్రామం లేదని బట్టి విక్రమార్క అన్నారు. హోం రూల్ కార్యక్రమం నుంచి దేశానికి స్వాతంత్ర్యం వచ్చే దాకా నెహ్రూ పాత్ర ఉందని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం అనేక దేశాలు తిరిగి మద్దతు కూడగట్టిన ధీశాలి జవహర్ లాల్ నెహ్రూ అని బట్టి విక్రమార్క అన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన ప్రధానిగా బాధ్యతలు తీసుకుని అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని ఆయన అన్నారు. పంచవర్ష ప్రణాళిక, ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేశారని ఆయన నెహ్రూని ప్రశంసించారు.