Site icon NTV Telugu

Breaking: డీసీపీపై భట్టి ఫైర్.. నన్నే తోస్తారా..?

Police

Police

రాజ్ భ‌వ‌న్ వ‌ద్ద ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ నేతలకు పోలీసులకు మధ్యం తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. నిరసన తెలుపుతున్న భట్టి విక్రమార్క ను డిసీపీ జోయల్ డెవిస్ ముందుకు తోయడంతో.. ఉద్రికత్త నెలకొంది. దీంతో.. భట్టి కి పోలీసులకు వాగివ్వాదం చోటుచేసుకుంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్ననన్నే తోస్తావా అంటూ డిసీపీ జోయల్ పై ఫైర్ అయ్యారు. అసలు ఎందుకు తోస్తున్నావంటూ మండిపడ్డారు. మీరెందుకు మమ్మల్ని ఆపుతున్నారంటూ నిలదీసారు.

శాంతియుతంగా మేము నిరసన తెలుసుతుంటే మమ్మల్ని అదుపులో తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలను దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం పై భట్టి తీవ్రంగా ఖండించారు. బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అమ్మేస్తున్నారని మండి పడ్డారు. దేశం సర్వనాశనం అవుతోందని నిప్పులు చెరిగారు భట్టి. తనని ఎందుకు తోసారంటూ మండి పడ్డారు. మాపై మీ జులుం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్నే తోస్తావా అంటూ పోలీసులకు ప్రశ్నించారు.

కాగా..  మీడియాతో మాట్లాడుతుంటే అడ్డుకోవ‌డం ఏంట‌ని నిప్పులు చెరిగారు రేణుకా చౌద‌రి. ఆమెను  పోలీసులు చుట్టుమ‌ట్ట‌డంతో ఆమె ఫైర్ అయ్యారు. తనను అరెస్ట్‌ చేసేందుకు యత్నించిన ఎస్సై చొక్కా పట్టుకున్న రేణుకా చౌదరి.  మ‌హిళ‌ల‌ను మహిళా పోలీసులు అరెస్ట్ చేయాల‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు.దీంతో పోలీసులకు రేణుకా చౌదరి మధ్య తోపులాట, వాగివ్వాదం చోటు చేసుకుంది. జీపు ఎక్క‌ను అంటూ ఆమె స‌సేమిరా అనడంతో.. పోలీసులు ఆమెను బ‌ల‌వంతంగా జీపులో ఎక్కించారు.

కాంగ్రెస్ ను ఎవ‌రు అడ్డుకోలేర‌ని హెచ్చ‌రించారు. రాజ్ భ‌వ‌న్ ప్రాంతమంతా కాంగ్రెస్ నేత‌ల‌తో అట్టుడుకింది. దీంతో .. రాజ్‌భవన్‌ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్‌ శ్రేణులపై పోలీసుల లాఠీఛార్జ్ చేశారు. జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, గీతారెడ్డి, భట్టి విక్రమార్క, అంజన్‌కుమార్‌, రేణుకాచౌదరి లను అరెస్ట్ చేశారు. రేణుకా చౌదరి ని అరెస్ట్‌ చేసేందుకు యత్నించిన ఎస్సై చొక్కా పట్టుకుకోవ‌డంతో.. ఉదృక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొంది.

హైద్రాబాద్ లోని రాజ్ భ‌వ‌న్ ముట్ట‌డికి కాంగ్రెస్ నేత‌లు ముట్ట‌డికి పిలుపు నిచ్చిన విష‌యం తెలిసిందే. విడతల వారీగా కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్ భవన్ ముట్డడికి వచ్చారు. మోదీ కొ హటావ్ దేశ్ కొ బచావ్ అనే నినాదాలతో రాజ్ భవన్ అట్టుడికింది. ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులతో కాంగ్రెస్ కార్యకర్తలు వాగ్వావాదానికి దిగారు. కాంగ్రెస్ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకొంది. దీంతో ఉద్రిక్తత నెలకొంది.

Chidambaram: ఎంపీలను అర్థరాత్రి వరకు పీఎస్‌లలో ఉంచి వేధించారు..

Exit mobile version