సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 58వ రోజు శనివారం చేవెళ్ల నుంచి షాద్నగర్ నియోజకవర్గంలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కర్ణాటక.. ఎన్నికలతో ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. జోడో యాత్ర ఫలితమని, మతం పేరుతో జరిగే పాలనకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయన్నారు. కర్ణాటకలో అవినీతిని ప్రజలు సహించలేదన్నారు. దేశ సంపద కాపాడటం కోసం రాహుల్ పిలుపు ఇచ్చారని, ప్రజలు మద్దతు పలికారన్నారు. మోడీ..అడ్డగోలుగా విషప్రచారం చేశారన్నారు.
Also Read : Urinal Problem : మూత్ర విసర్జన సమయంలో నొప్పి? కారణం తెలుసుకో..
రాముడిని మోసం చేశారు అని హనుమాన్ భక్తులు కూడా మోడీకి బుద్ది చెప్పారన్నారు. కర్ణాటక ఎన్నికలు దేశ వ్యాప్తంగా ప్రభావం ఉంటుందన్నారు. కాంగ్రెస్‌లో నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటాయని, భిన్నాభిప్రాయాలు నుండి ఏకాభిప్రాయం అధిష్టానం సాధిస్తోందన్నారు. కర్ణాటక లో అయినా..తెలంగాణలో అయినా అంతే అని, కర్ణాటకలో మాదిరిగా..తెలంగాణ లో కూడా అవినీతి ఉందన్నారు. ప్రభుత్వ పెద్దలు దోపిడీకి పాల్పడ్డారని, తెలంగాణ ఆత్మగౌరవం లేకుండా చేశారన్నారు. జనం పట్టించుకోలేదని, కేటీఆర్ సీఈఓ అనుకుంటున్నారని, జడ్చర్ల లో భారీ సభ ఉంటుందని, తరవాత నల్గొండ.. ఖమ్మంలో సభలు ఉంటాయని భట్టి విక్రమార్క వెల్లడించారు.
Also Read : Telangana Congress party: కర్ణాటక ఫలితాలు తెలంగాణ రాజకీయాల్ని మలుపు తిప్పుతాయా..?
