KA Paul: రేవంత్‌రెడ్డి అప్పులు తెస్తున్నాడు గానీ.. అభివృద్ధి లేదు
- రేవంత్‌రెడ్డి అప్పులు తెస్తున్నాడు గానీ.. అభివృద్ధి లేదు
- ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ.పాల్ ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేవంత్‌రెడ్డి సర్కార్‌పై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ.పాల్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్.. 7 లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్లిపోతే.. రేవంత్ సర్కార్ వచ్చన తర్వాత మరో లక్ష కోట్లు పెరిగాయన్నారు. కానీ అభివృద్ధి మాత్రం శూన్యం అని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరుపల్లెలో కేఏ.పాల్ మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి సమ్మిట్ పెడతానని చెప్పి ఏడాదైనా పెట్టలేదన్నారు.
ఇది కూడా చదవండి: Deputy CM Pawan Kalyan: రేపు సాలూరుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Also Read
- Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
- Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
- Bhadradri Kothagudem: నాలుగు నెలల క్రితం యువకుడి పేరుతో రూ.కోటి బీమా.. ఆ సొమ్ము కోసం హత్యకు యత్నం
- Kothagudem Municipal Corporation : కొత్తగూడెం కార్పొరేషన్ పై ఎర్రజెండా..!
సర్పంచ్‌లకు అప్పులు ఎక్కువై.. అభివృద్ధి లేక ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఈ దుస్థితిని ప్రజాశాంతి పార్టీ ఉండనివ్వదన్నారు. మాజీ సర్పంచులు, కొత్తగా ఎన్నికల్లో పోటీ చేసే వారు ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేసి గెలవాలన్నారు. వందరోజుల్లో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానన్నారు. కుల పాలన పరంగా ఐదు శాతం రెడ్లు ఉంటే ముఖ్యమంత్రి అయ్యారని.. మూడు శాతం ఉన్నవారు ముగ్గురయ్యారు. ఒక శాతం ఉన్నవారు ఇద్దరు సీఎంలుగా అయ్యారన్నారు. బీసీలు 60 శాతం, దళితులు 16 శాతం ఉన్నారని.. ఎస్సీ ఎస్టీ మైనార్టీ కలిపి 90 శాతం ఉన్నా సీఎం కాలేకపోయారని తెలిపారు. ప్రజాశాంతి పార్టీకి ఒక అవకాశం ఇస్తే వంద రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: రాహుల్ గాంధీపై ‘‘హత్యాయత్నం కేసు’’.. కాంగ్రెస్ కుట్ర ఆరోపణ..
కొత్తగూడెం కలెక్టరేట్ దగ్గర జరుగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల ధర్నాలో కేఏ.పాల్ పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రోడ్డుపైన ఆకస్మికంగా కనబడిన పాల్‌తో సెల్ఫీలు దిగేందుకు జనాలు పోటీ పడ్డారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను సమగ్ర శిక్ష ఉద్యోగులకు నెరవేర్చాలని కేఏ.పాల్ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!