Basti Dawakanas in Telangana: బస్తీ దవాఖానాలతో పేదలకు వైద్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పేదలకు మరింత మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయం అన్నారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం, భారతీ నగర్ డివిజన్ల పరిధిలో బస్తీదవాఖానాలను ప్రారంభించారు మంత్రి హరీశ్ రావు. బస్తీల్లో పేదల సుస్తీ పోగొట్టేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాలు ప్రారంభించారన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 256 బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ప్రారంభించింది.
ఈ దవాఖానాల్లో నిపుణుడైన MBBS డాక్టర్, స్టాఫ్ నర్స్, ఇతర సిబ్బంది మీకు వైద్య సేనలు అందిస్తారు.ఉచితంగా వైద్య సేవలు, అన్ని రకాల మందులు అందుబాటులో ఉంటాయి.బస్తీ దవాఖానాల్లో మీకు అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేస్తారు. టీ డయాగ్నసిస్ ద్వారా 57 రకాల పరీక్షలు మీకు ఉచితంగా చేస్తారు.ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దన్నారు. ఈ మోడల్ దేశానికి ఆదర్శంగా నిలిచింది.
Also Read
- Student Protest: నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్..
- Ashok Sharma: తమ్ముడి భవిష్యత్తు కోసం కెరీర్‌నే త్యాగం చేసిన అన్నయ్య.. టీమిండియా క్యాప్ సాధించి కన్నీటిపర్యంతమైన అశోక్ శర్మ!
- CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
- Covid 19: కోవిడ్‌పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
ఈ బస్తీ దవాఖానాలు అన్ని రాష్ట్రాల్లో పెట్టాలని 15 వ ఆర్థిక సంఘం సూచించింది.టీ డయాగ్నోస్టిక్ ద్వారా మీరు రక్తం ఇస్తే అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేసి రిపోర్ట్ మీ సెల్ ఫోన్లకు అందుతుందన్నారు మంత్రి హరీష్ రావు. బస్తీ దవాఖానల సేవలు వినియోగించుకోవాలని హరీష్ రావు సూచించారు. హైదరాబాద్ పరిథిలో 256 బస్తీదవాఖానాల ద్వారా సగటున ప్రతీ రోజు 2 లక్షల 50 వేలమంది ఉచిత వైద్యం అందుతోంది.
పఠాన్ చెరులో ఇప్పటికే 3 బస్తీ దవాఖానాలున్నాయి. ఇవాళ మరో మూడు కొత్త దవాఖానాలు ప్రారంభించుకున్నాం.ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇక మందులు లేవు అన్న సమస్యే ఉండదు. పాము కాటు, కుక్క కాటు, డెంగ్యూ, మలేరియా సహా అన్ని రకాల మందులు ప్రభుత్వ ఆసుుత్రుల్లో అందుబాటులో ఉంటాయి. ఇప్పటి వరకు కరోనా సేనలు అందించిన గచ్చిబౌలి లోని టిమ్స్ లో ఇక అన్ని రకాల వైద్య సేవలు , కార్పోరేట్ ఆ ఆసుపత్రుల స్థాయిలో అందుబాటులో ఉంటాయి. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో అందే అన్ని రకాల వైద్య సేవలు, గుండె,కిడ్నీ, కాలేయం సంబంధిత సర్జరీలు ఉచితంగా పేదలకు టిమ్స్ ద్వారా అందిస్తాం.
పేద ప్రజలకు ఉత్తమ సేవలు అందాలని సీఎం కేసీఆర్ గారు వైద్య రంగాన్ని బలోపేతతం చేస్తున్నారు. పేదలు ఖర్చు ఎక్కువ పెట్టేది వైద్యం, విద్య పైనే. 7280 కోట్లతో మన ఊరు – మన బడి పేరుతో వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 12 రకాల సౌకర్యాలు కల్పించనున్నాం.డిజిటల్ క్లాస్ రూంలు, క్లాస్‌రూం కు రంగులు, మంచి బోర్డులు, బాత్ రూం, మంచి నీరు ఇలా అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేస్తామన్నారు. బొంబాయి కాలనీలోని పాఠశాలను తొలి విడతగా అభివృద్ధి చేస్తాం. పేద పిల్లలకు కార్పోరేట్ తరహా ఆంగ్ల మాధ్యమంలో విద్య అందిస్తాం అన్నారు ఆర్థికమంత్రి హరీష్ రావు.
తాజావార్తలు
-
Student Protest: నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్..
-
Shreyas Iyer Record: ఎంఎస్ ధోనీ రికార్డు బద్దలు.. ప్రపంచంలోనే తొలి కెప్టెన్‌గా శ్రేయస్ సరికొత్త చరిత్ర!
-
Janani Dialogues 2026: భారతదేశపు పునరుత్పత్తి ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. ‘ఒయాసిస్ అకాడమీ’ ప్రారంభం
-
Ashok Sharma: తమ్ముడి భవిష్యత్తు కోసం కెరీర్‌నే త్యాగం చేసిన అన్నయ్య.. టీమిండియా క్యాప్ సాధించి కన్నీటిపర్యంతమైన అశోక్ శర్మ!
-
Trump Tariffs: మళ్లీ షాకిచ్చిన ట్రంప్.. భారత్ సహా 17 దేశాలపై అమెరికా అదనపు సుంకం..
ట్రెండింగ్
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్‌లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?
-
Shreyas Iyer: ఆ ఇద్దరే మ్యాచ్ గెలిపించారు.. మాటలు రావడం లేదు.. తొలి విజయంపై శ్రేయస్ భావోద్వేగం!