NTV Telugu Site icon

Bandi sanjay: నేడే జైలు నుంచి ‘బండి’ బయటకు..

Bandi Sanjay

Bandi Sanjay

Bandi sanjay: కరీంనగర్ జిల్లా జైల్లో ఉన్న బండి సంజయ్ కి నిన్న రాత్రి బెయిల్ మంజూరైంది. సుదీర్ఘ వాదోపవాదాల తరువాత షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరి పూచీకత్తుతో నిన్న రాత్రి 10 గంటలకు రిలీజ్ ఆర్డర్ కోర్టు ఇచ్చింది. సాక్షులను ప్రభావితం చేయవద్దని సాక్ష్యాలను చేరిపివేయవద్దని న్యాయస్థానం షరతులు విధించింది. దీంతో కరీంనగర్ జైలుకు సంజయ్ బెయిల్ పత్రాలు చేరాయి. ఇవాళ మధ్యాహ్నం వరకు సంజయ్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

Read also: CNG Rates: 10 శాతం వరకు తగ్గనున్న సీఎన్‌జీ ధరలు.. ధర విధానంలో మార్పుకు కేంద్రం ఆమోదం..

బండి సంజయ్ కు బెయిల్ రావడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అక్రమంగా బనాయించిన కేసు విచారణలో సహకరిస్తామన్నారు. మాకు న్యాయవ్యవస్థపై సంపూర్ణ విశ్వాసం ఉందని అన్నారు. క్రమ కేసులతో గొంతునొక్కాలని కేసీఆర్ సర్కారు ప్రయత్నిస్తోందని అన్నారు. కల్వకుంట్ల కుటుంబ అరాచకాలపై బీజేపీ పోరాటం కొనసాగుతుందని అన్నారు. BRS పార్టీ ఎన్ని కుట్రలు , కుతంత్రాలు చేసిన ధర్మం న్యాయం ముందు నిలబడవు అని అన్నారు. నిరంకుశ విధానాలతో నియంతృత్వ ధోరణితో రాష్త్రాన్ని పాలిస్తున్న కేసీఆర్ కు ప్రజలే బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

టెన్త్ పేపర్ లీకేజీ లో మంగళవారం సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేసిన తెలిసిందే. ప్రశ్నా ప్రతాల లీకేజీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్‌ కి నిన్న హనుమకొండ కోర్టు 14 రోజుల రిమాండ్‌ను విధించింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్‌ తరుఫున లాయర్లు బెయిల్‌ పిటిషన్‌ను దాఖలు చేయగా కోర్టు విచారణ చేపట్టింది. ఇదే సమయంలో బండి సంజయ్‌కు బెయిల్‌ ఇవ్వద్దని.. కస్టడీ పిటిషన్‌ దాఖలు చేశారు పోలీసులు. దీంతో.. రెండు పిటిషన్లపై హనుమకొండ ఫస్ట్ క్లాస్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అనిత రాపోలు విచారణ చేపట్టారు. అయితే.. మధ్యాహ్నం 2.45 గంటలకు ప్రారంభమైన విచారణ 8 గంటల పాటు ఉత్కంఠగా సాగింది. బండి సంజయ్‌కు ఈ పేపర్‌ లీకేజీతో సంబంధం లేదని ఆయన తరుఫు లాయర్లు వాదనలు ఒకవైపు ఉండగా.. బండి సంజయ్‌కు బెయిల్‌ ఇస్తే.. ఆధారాలు తారుమారు చేస్తారని, ఇంకా ఆయనను విచారించాల్సింది ఉందంటూ.. పోలీసులు మరోవైపు వాదనలు వినిపించారు. దీంతో బండి సంజయ్‌ బెయిల్‌పై నిర్ణయాన్ని మూడుసార్లు వాయిదా వేసిన మెజిస్ట్రేట్ చివరకు ఉత్కంఠ పరిస్థితుల మధ్య షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.