Part Time Jobs Fraud: హైదరాబాద్ లో ఫేక్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి లక్షలు కాజేస్తున్న ముఠాను పోలీసులు అదుపులో తీసుకున్నారు. పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను ఇవాల సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో అమాయకులను కేటుగాళ్లు బురిడీ కొట్టించారు. ఫ్లోరా సొల్యూషన్స్ లో డేటా ఎంట్రీ ఉద్యోగాలు అని సోషల్ మీడియాలో ప్రకటనలు ఇవ్వడంతో నిరుద్యోతులు దానికి ఆశపడ్డారు. వారిచ్చిన నెంబర్లకు కాల్ చేసి ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. అయితే.. ఉద్యోగాల్లో చేర్చుకున్న తర్వాత కంపెనీ రూల్స్ అతిక్రమించారని ఫేక్ నోటీసులు పెట్టి.. కేసు నమోదు చేయకుండా ఉండాలంటే డబ్బులు కట్టాలని బెదిరించి డబ్బులను తీసుకునేవారు.
Read also: The Raja Saab: ప్రభాస్ రాజు వచ్చేది నెక్స్ట్ సంక్రాంతికే… హింట్ ఇచ్చిన మేకర్స్
ఇలా ఒకటి కాదు రెండు కాదు.. 25 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమాయకులను ముఠా మోసం చేసింది. ఇదే తరహాలో హైదరాబాద్ కి చెందిన యువతిను మోసం చేసిన కేటుగాళ్లు. ఫేక్ లీగల్ నోటీసులతో బెదిరించి.. పలు దగాల్లో 6 లక్షల 17 వేల రూపాయలు దండుకున్నారు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి చివరకు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు గుట్టు బయటకు వచ్చింది. దీంతో కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం పోలీసులు రంగంలోకి దిగి ముఠాను అదుపులో తీసుకున్నారు. గుజరాత్ కి చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా పై దేశ వ్యాప్తంగా 358 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణ వ్యాప్తంగా 28 కేసులు.. సైబరాబాద్ పరిధిలో 11 కేసులు నమోదైనట్లు గుర్తించారు. ఇలాంటి ఫేక్ ముఠా చేతుల్లో నిరుద్యోగులు మోసపోవద్దంటూ పోలీసులు సూచించారు.
Minister Dharmana Prasada Rao: టైటిలింగ్ యాక్ట్ చట్టం ఇంకా అమలు చేయలేదు..