Bandi Sanjay: భారతీయ జనతా పార్టీ (బీజేపీ), తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై పార్టీ అధిష్టానం గట్టి నమ్మకాన్ని పెట్టుకున్నట్టుందే.. సంజయ్ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.. దానికి కారణం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం.. ఎందుకంటే.. 2024 వరకు బండి సంజయ్‌నే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉంటారని స్పష్టం చేశారు తరుణ్ చుగ్.. పార్టీ సంస్థాగత ఎన్నికలు జరిగేవరకు అధ్యక్షుడిగా సంజయ్ కొనసాగుతారని క్లారిటీ ఇచ్చారు.. ఇక, కార్నర్ మీటింగ్‌లతో కేసీఆర్ సర్కార్‌కు చివరి మేకు దించుతున్నాం అన్నారు.. బీజేపీ జిల్లా అధ్యక్షుల సంస్థాగత స్ట్రక్చర్ లో మార్పు చేయాలని నిర్ణయం తీసుకున్నాం.. తెలంగాణలో ఉన్న రెవెన్యూ జిల్లాల ఆధారంగా పార్టీ అధ్యక్షులను నియమించడం కాకుండా నియోజకవర్గాలను బేస్‌గా చేసుకుని అధ్యక్షులను పెట్టాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.
ఒక్క అసెంబ్లీ నియోజక వర్గం రెండు జిల్లాల్లో ఉండడంతో సంస్థాగత ఇబ్బందులు వస్తున్నాయని పార్టీ దృష్టికి తీసుకెళ్లారు నేతలు.. ప్రస్తుత జిల్లా అధ్యక్షుల అభిప్రాయం తీసుకున్నారు సునీల్ బన్సల్.. బూత్ సశక్తికరణ్ అభియాన్ పూర్తి కాగానే మార్చుదామని పార్టీ శ్రేణులకు బన్సల్ సూచించారు.. స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు భేష్.. అంటూ పార్టీ నాయకులను బండి సంజయ్, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ అభినందించారు.. ఇంకా, విస్త్రతస్థాయిలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు నిర్వహించాలని సూచించారు.. దీనికి గడువు పొడిగించాలని నేతలు కోరారు.. దీంతో, ఈ నెల 28వ తేదీ వరకు స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహణ గడువు తేదీని పొడిగిస్తున్నట్టు బన్సల్ తెలిపారు.. 28న సాయంత్రం 119 నియోజకవర్గాల్లో కార్నర్ మీటింగ్‌లు ముగియనున్నాయి.. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు. ఒక్కో నియోజకవర్గంలో సగటున 5 వేల మందికి తగ్గకుండా సభలు నిర్వహించి జయప్రదం చేయాలని కోరారు.
మరోవైపు.. బీజేపీ బూత్ సశక్తికరణ్ అభియాన్ నిర్వహించబోతున్నారు.. వచ్చే నెల 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు అభియాన్ నిర్వహించనున్నారు.. ఇకపై బూత్ కమిటీలో 31 మంది.. ఇందులో 20 మంది పన్నా ప్రముఖ్, ఒక సోషల్ మీడియా ఇంఛార్జి… 10 మంది కేంద్ర ప్రభుత్వ పథకాల ఇంఛార్జిలు ఉండనున్నారు.. ప్రతి పోలింగ్ బూత్ లో రెండు వాట్సప్ గ్రూప్ లు.. ఒకటి కార్యకర్తలతో, మరొకటి ఓటర్లతో ఏర్పాటు చేయనున్నారు.. వారం రోజుల పాటు పార్టీ సరల్ యాప్ డౌన్ లోడ్ చేయడం, బూత్ కమిటీలను జాబితాను అప్లోడ్ చేయడం చేస్తారు.. వచ్చే నెల 3 నుండి 6 వరకు నియోజక వర్గాల వారీగా వర్క్ షాప్స్ , ట్రైనింగ్ నిర్వహిస్తారు.. అభియాన్ కు నియోజక వర్గంలో పది రోజుల పాటు పూర్తి సమయం ఇచ్చే 90 మంది కార్యకర్తలను ఎంపిక చేస్తారు. వచ్చే నెల 9 నుండి 11వ తేదీ వరకు శక్తి కేంద్రాల వారీగా పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగంపై సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.