NTV Telugu Site icon

Bandi Sanjay: బరాబర్ మాట్లాడతా.. మతతత్వవాది అనే బోర్డును మెడలో వేసుకుని తిరుగుతా

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: తెలంగాణలో రాజకీయ వేడి రోజురోజుకూ వేడెక్కుతోంది. పార్టీ నుంచి వ్యక్తిగతంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బండి సంజయ్ నేతృత్వంలో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. జగిత్యాల జిల్లా బొమ్మెన గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన బండి సంజయ్ అన్నారు. హిందూ ధర్మం కోసం మతం మాట్లాడితే మతతత్వమైతే, బరాబర్ మాట్లాడతా, అవసరమైతే మతతత్వవాది అనే బోర్డును మెడలో వేసుకుని తిరిగేందుకు సిద్ధమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. హిందూ ధర్మానికి ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించేవాడే నిజమైన హిందువులు అన్నారు.

Read also: Harish Rao: అభివృద్ధి చూడండి.. తప్పుడు ప్రచారాలు చేయకండి

ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలవాలనే తపనతో హిందూ మతం కోసం పనిచేసే వారు నిజమైన హిందువులే కాదన్నారు. హిందూ ధర్మ పరిరక్షణలో హిందూ సమాజాన్ని ఏకం చేసేవాడే నిజమైన భారతీయుడని అన్నారు. తెలంగాణలో రామరాజ్యం ఏర్పాటు చేసే వరకు విశ్రమించబోమన్నారు. హిందూ ధర్మం కోసం నిరంతరం కృషి చేసిన శివాజీ మహారాజ్‌ విగ్రహాలను దేశంలో ప్రతిచోటా నెలకొల్పాలని కోరారు. మొఘల్ సైనికులు శివలింగంపై మూత్రం పోస్తే, ఆనాడు చిన్న పిల్లవాడిగా ఉన్న శివాజీ పెద్దయ్యాక వారందరినీ తరిమికొట్టిన వీరుడిగా కీర్తించారు. కేసీఆర్ అరాచకాలను ఆ పరమేశ్వరుడు చూస్తున్నాడని, అందుకే ఆయన కుమార్తె పేరు చార్జిషీటులో ఉందన్నారు. మద్యం కుంభకోణంలో కేసీఆర్ కూతురు రూ. 100 కోట్లు తీసుకున్నారు. ఛార్జిషీట్‌లో ఆమె పేరు ఉన్నప్పటికీ కేసీఆర్ ఈ విషయంపై ఎందుకు మాట్లాడటం లేదు? తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.
Hyderabad Job Fraud: ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్