రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. భక్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ నాస్తికుల రాజ్యాంగ మారిపోయిందన్నారు. సీఎం కేసీఆర్ వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం 400 కోట్లు కేటాయిస్తా అన్నాడు…ఊహ చిత్రాలు మాత్రమే చూపించాడని ఎద్దేవా చేశారు. మేడారం జాతర కంటే ముందుగా రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ కానీ భక్తుల సౌకర్యాల పై ప్రభుత్వం సమీక్ష చేయక పోవడం బాధాకరమని బండి సంజయ్ అన్నారు. సీఎం కేసీఆర్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని బండి సంజయ్ అన్నార. సీఎం కేసీఆర్ రాజన్నకు ఇచ్చిన హామీలు ఎందుకు నేరవేర్చలేదని బండి సంజయ్ ప్రశ్నించారు.
Read Also:ఎన్నికల కోసం కేజ్రీవాల్ వినూత్న కార్యక్రమం
క్యూలైన్‌లో పసి పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆలయంలో శానిటేషన్ విఫలమైందని పరిశుభ్రత లేదన్నారు. తెలంగాణ వచ్చాక ఇన్‌చార్జ్ ఈఓలే ఉన్నారు. ప్లాన్ ప్రకారం ఇన్‌చార్జ్ ఈఓలను మారుస్తున్నారు. రాజన్న ఆలయంపై పేద భక్తులపై ప్రభుత్వానికి ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఎందుకని మండిపడ్డారు. ఆనాడు సమైక్యాంధ్ర కాబట్టి వివక్ష అయింది అన్నాడు. మరి తెలంగాణ రాష్ట్రమే కదా సీఎం గా ఉన్నది నువ్వే కదా ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతి పాదనలు ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం తరుపున రాజన్న ఆలయాన్ని మేము అభివృద్ధి చేస్తామని బండి సంజయ్ కేసీఆర్‌కు సవాల్ విసిరారు. రాజన్న దేవుడికి సీఎం కేసీఆర్ శఠగోపం పెడుతావా…దేవుడికి ఇచ్చిన హామీలు నెరవేర్చక పోతే..నీ సంగతి దేవుడే తెలుస్తాడన్నాడు. దేవాలయ అభివృద్ధిపై రంగు రంగుల బ్రోచర్లు చూపిస్తు ఇంకెంత కాలం భక్తులను మోసం చేస్తావ్ కేసీఆర్ అంటూ బండి సంజయ్ ఘాటుగా విర్శించారు.
