Site icon NTV Telugu

Bandi Sanjay : “No Ram, No Ramayana”అని సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసింది కాంగ్రెస్సే

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay : కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో శ్రీరాముడి పేరును ఎగతాళి చేస్తూ వస్తోందని, రాముడి పట్ల వారికి గౌరవం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. బండి సంజయ్ మాట్లాడుతూ – “రామ సేతు కేసులో ‘No Ram, No Ramayana’ అని సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన పార్టీ కాంగ్రెస్‌నే. దశాబ్దాల పాటు రామ మందిర తలుపులు మూసి వేసింది కూడా కాంగ్రెస్‌నే. రాహుల్ గాంధీ ఒకప్పుడు ‘రామ్ మందిర ఉద్యమం ఓడిపోయింది’ అని వ్యాఖ్యానించలేదా? హిందువులను ‘హింసాత్మకులు’ అని అన్నది కాంగ్రెస్‌నే. రామ్ మందిర ప్రాణ ప్రతిష్ఠకి కూడా హాజరుకావడానికి నిరాకరించింది అదే పార్టీ” అని ఆరోపించారు.

Rave Party : హైదరాబాద్ గచ్చిబౌలిలో రేవ్ పార్టీ భగ్నం.. డిప్యూటీ తహసీల్దార్ సహా పలువురు

ఇక ఇప్పుడు రాముని పేరు ప్రస్తావిస్తున్న బీజేపీని కాంగ్రెస్ ఎగతాళి చేస్తోందని, ఇది వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని బండి సంజయ్ పేర్కొన్నారు. “కాంగ్రెస్‌కు రాముని అవమానించడం అలవాటే. కానీ బీజేపీకి రాముడు అంటే ప్రాణం, విశ్వాసం. రాముడు రాజకీయాల కోసం కాదు… ఈ దేశపు గుండె చప్పుడు” అని ఆయన స్పష్టం చేశారు. రామ మందిర నిర్మాణం, ప్రాణ ప్రతిష్ఠ వంటి సందర్భాల్లో కాంగ్రెస్ వైఖరి ప్రజలు మర్చిపోలేరని, రాముని పట్ల ఉన్న ఆప్యాయతను బీజేపీ ఎప్పటికీ రాజకీయం చేయదని బండి సంజయ్ పునరుద్ఘాటించారు.

Minister Atchannaidu: రైతులకు ఎరువుల కొరత రానివ్వను.. మంత్రి హామీ!

Exit mobile version