Site icon NTV Telugu

TNGO Leaders: బండి సంజయ్ సారీ చెప్పాలి.. టీఎన్జీవో నేతల డిమాండ్

Bandi Sanjay1

Bandi Sanjay1

TNGO Leaders: బండి సంజయ్ తెలంగాణ ఉద్యోగుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యాఖ్యానించడం సరికాదని టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్ మండిపడ్డారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలను సంప్రదిస్తామన్నారు. కేసీఆర్ కు ఉద్యమ బంధం తెలంగాణ ఉద్యోగులకు ఉందని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యోగులకు మధ్య పేగు బంధం ఉంటుందని తెలిపారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులకు మంచి చేసిందని అన్నారు. బండి సంజయ్ తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నారని తెలిపారు. సకల జనుల సమ్మెలో ఉద్యోగులకు సంజయ్ ఎందుకు మద్దతు ఇవ్వలేదని అన్నారు. ఉద్యోగులు వ్యక్తులు కాదు శక్తులని తెలిపారు. బేషరతుగా బండి సంజయ్ ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. క్షమాపణ చెప్పకపోతే రేపట్నుంచి వరుస ఆందోళన కార్యక్రమాలు చేపడతామమని హెచ్చరించారు.

Read also: K. Laxman: నలుగురు ఎమ్మెల్యేలు నీతిమంతులైతే ప్రగతి భవన్ లో ఎందుకు దాచిపెట్టినట్టు

టీజీవో అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల జీతాలు కాదు జీవితాలు ముఖ్యమని చెప్పినామన్నారు. ఉద్యోగులపై ఎన్నోసార్లు అవమానకర రీతిలో మాట్లాడారని అన్నారు. సీఎం కేసీఆర్‌ ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకునే వ్యక్తి అని తెలిపారు. మేము ఎప్పుడు అడిగిన దానికంటే ఎక్కువే ఇచ్చారని ఆమె అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, ప్రభుత్వానికి ఉద్యోగులు అనుకూలంగా ఉండటంలో తప్పు లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కష్టపడి పని చేస్తుండటంతోనే కేంద్రం రాష్ట్రానికి అవార్డులు ఇస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు పని చేసినప్పుడు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని ప్రశ్నించారు. బండి సంజయ్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.
Girl Killed Boyfriend: ప్రియుడ్ని చంపిన ప్రియురాలు.. కేసులో ట్విస్టులే ట్విస్టులు

Exit mobile version