రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ జిల్లా స్థాయి శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఈ శిక్షణ తరగతుల్లో తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షడు బండి సంజయ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫామ్ హౌస్‌లో ఉన్న కేసీఆర్‌కు మీడియా ద్వారా కొన్ని విషయాలు తెలియజేయాలి అనుకుంటున్నాని బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అర్ధరాత్రి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏక్ నిరంజన్‌లా నిర్ణయాలు తీసుకుంటూ తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారన్నారు.
రాష్ట్రపతి ఇచ్చిన జీఓను 36 నెలల లోపట పూర్తి చేయకుండా ఫామ్ హౌస్ లో ఉండి ఉద్యోగులపై నిర్లక్ష్యం వహించారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్‌కు ఉద్యోగస్తుల గోస తగులుతుందన్నారు. దుర్మార్గమైన ఆలోచనలతో ఉద్యోగస్తుల్లో గందరగోళం సృష్టించారని దుయ్యబట్టారు.బదిలీలు కూడా వెంటనే చేసి జాయిన్ కావాలని ఆదేశించడం వల్ల వారి కుటుంబం చిన్నాభిన్నం అవుతుందన్నారు.. స్థానికత ఆధారంగా 90 శాతం ఉండాలని చెప్పారు కానీ ఎలా చేశారో ఇంతవరకు ప్రభుత్వం చెప్పలేదన్నారు. అనారోగ్యంతో ఉన్న ఉద్యోగస్తుల ఇబ్బందులను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఉద్యోగస్తుల సమస్యల పై స్పందించకుండా నిర్లక్ష్యం వహిస్తే బీజేపీ వారి పక్షాన ఆందోళనలు చేపడుతుందన్నారు.
Read Also:పాల వెల్లువ కార్యక్రమంపై టీడీపీ రాద్ధాంతం చేస్తోంది: అప్పలరాజు
రాష్ట్రంలో 370యాక్ట్ వచ్చినట్లు ఉందని ఆరోపించారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత నీ పక్కదారి పట్టించడానికి వరి ధాన్యం ముచ్చట తీసుకు వచ్చిందని ఎద్దేవా చేశారు. రైతుల సమస్యలు లేకుండానే కావాలని ఆ విషయం తీసుకువచ్చారని ధ్వజమెత్తారు. బాయిల్డ్ రైస్ కొనుగోలు విషయంలో ఒప్పందం కుదర్చుకుని, బలవంతంగా ఒప్పించారని ఆరోపణలు చేయడం హస్యాస్పదంగా ఉందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ కావాలనే రాజకీయం చేస్తున్నారన్నారు. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ ఎంపీలు ఎందుకు ఆందోళన చేశారో వారికే తెలియదన్నారు.కేసీఆర్‌కు ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్పే రోజు వస్తుందని బండి సంజయ్ విమర్శించారు.
