Site icon NTV Telugu

Bandi Sanjay: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాతో టచ్‌లో ఉన్నారు

Bandi Sanjay, Komatireddy

Bandi Sanjay, Komatireddy

యాదాద్రి జిల్లా గొల్లగూడ నుండి మూడో విడత 4వరోజు బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేసారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా మాతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. బీజేపీకి, మోడీకి అనుకూలంగా కోమటిరెడ్డి మాట్లాడారని అన్నారు. మునుగోడులో గెలుపు మాదే అని, మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ఉప ఎన్నికలు వస్తాయని పేర్కొన్నారు. మునుగోడులో 100% బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసారు.

read also: MP Gorantla Madhav: ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో కాల్‌ లీక్…? ఇదే కుట్రే అంటున్న ఎంపీ..

కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలుమార్లు బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారని అన్నారు. అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు బీజేపీకి టచ్ లోకి వచ్చారని బండి సంజయ్‌ అన్నారు. తెలంగాణలో మరికొన్ని చోట్ల ఉప ఎన్నికలకు వచ్చే అవకాశం ఉందని అన్నారు. క్యాసినో డ్రగ్స్ కేసులో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు సంబంధం ఉందని విమర్శించారు. మంత్రుల తమ అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి మాత్రమే జోకర్లలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చికోటి ప్రవీణ్ వెనుక ఉన్నది.. కెసిఆర్ కుటుంబ సభ్యులే అని సంచలన వ్యాఖ్యలు చేసారు.
Kolanapaka-Bachannapet: వాగు ఉధృతికి స్కూటీతో కొట్టుపోయిన టీచర్‌..! ఏం జరిగిందంటే..?

Exit mobile version