Site icon NTV Telugu

Bandi Sanjay: ఇండియా- న్యూజిలాండ్ మ్యాచ్ తప్పా.. బీఆర్ఎస్ సభను ఎవరు పట్టించుకోలే..

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: ఇండియా- న్యూజిలాండ్ మ్యాచ్ తప్పా.. నిన్న బీఆర్ఎస్ సభను ఎవరు పట్టించుకోలేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సభకు వచ్చిన జనాలు, నేతలు మనస్పూర్తిగా పాల్గొనలేదని ఎద్దేవ చేశారు. బెదిరించి సభను సక్సెస్ చెయ్యాలని చూసారని ఆరోపించారు. కర్నాటక మాజీ సీఎం, బీహార్ సీఎం నితీశ్ కూడా రాలేదని అన్నారు బండి సంజయ్‌. కేసీఆర్ దగ్గర ఉన్న లిక్కర్ డబ్బులు పంచుకోవడానికి జాతీయ నేతలు వచ్చినట్లున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నోట ఏ దేశం మాట వచ్చినా ఆ దేశం సర్వనాశనం అవుతుందని అన్నారు. పాకిస్థాన్ గురించి మాట్లాడితే అక్కడ తిండి గురించి కొట్లాడుకుంటున్నారని అన్నారు.

Read also: Income Tax Raids: హైదరాబాద్ లో రెండో రోజు ఐటీ రైడ్స్.. రియల్ ఏస్టేట్ ప్లాట్ల విక్రయాలపై ఆరా

దయచేసి భారత దేశం బాగుందని కేసీఆర్ నోటి వెంట ఆ మాట రావద్దని కోరుకుంటున్నానని మీడియా ముఖంగా కేసీఆర్‌ పై ఆరోపణలు గుప్పించారు. తెలంగాణలో 21 డ్యాంల నిర్మాణాలను 8 సంవత్సరాల నుండి పెండింగులో పెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియదని ఎద్దేవ చేశారు. పొలం దగ్గర ఫ్రీ కరెంట్ అని, ఇంటి దగ్గర కరెంట్ కు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. డిస్క్ంలకు డబ్బులు కట్టకుండా ఫ్రీ కరెంట్ అంటున్నారని.. ముందు వాళ్లకు కట్టాల్సిన బకాయిలు చెల్లించాలని సూచించారు. ఫ్రీ కరెంట్ ఇస్తే ఆ ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు. కేసీఆర్ ఒక జోకర్, ఆయన జోకర్ మాటలు మాట్లాడుతున్నారని మండి పడ్డారు. నిన్న ఖమ్మం సభలో ఇచ్చిన స్పీచ్ గతంలో మాట్లాడిందే! కొత్తగా ఏం మాట్లాడలేదని అన్నారు. వందేభారత్ ట్రైన్ లు దేశీయంగా మేకిన్ ఇండియాలో భాగంగా తయారయ్యాయని అన్నారు.

Read also: Kanti Velugu: నేడు కంటి వెలుగు రెండో విడత.. ఆధార్‌, రేషన్‌, ఆరోగ్యశ్రీ తప్పనిసరి

కేసీఆర్ వేషం, భాష తుపాకి రాముడు మాటలే! అని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ లను వ్యతిరేకించిన సమాజ్ వాదీ పార్టీ తో కేసీఆర్ జతకట్టాడని అన్నారు. దళితులను వంచించిన కేసీఆర్ కు వాళ్ల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. దళితులను పారిశ్రామిక వేత్తలుగా మార్చిన ఘనత బీజేపీదే అని అన్నారు బండి సంజయ్‌. దళితులకు కేసీఆర్ ఏం చేసాడో చెప్పాలని ప్రశ్నించారు. ఖమ్మం సభలో కేసీఆర్ కనీసం జై తెలంగాణ అని మాట్లాడలేదని గుర్తుచేశారు. తెలంగాణను మరచి పోయిన కేసీఆర్ తో జై తెలంగాణ అనిపిస్తామన్నారు. ఒక విషయంలో కేసీఆర్, పంజాబ్ సీఎంలు ఒకటే అని అన్నారు. ఖమ్మం సభకు వచ్చిన నలుగురు నేతలు నాలుగు స్కాంలలో ఉన్నారని ఆరోపించారు. ఒక్క నేత బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడలేదని వ్యంగాస్త్రం వేశారు. దేశంలో వచ్చేది ఆప్ ప్రభుత్వం అని కేజ్రీవాల్ ప్రకటించాడని, మరి బీఆర్ఎస్ సంగతి ఏమిటి? అని బండి సంజయ్‌ నిన్న ఖమ్మంలో జరిగిన బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభనుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Blocked Jagityala: అష్టదిగ్బందంలో జగిత్యాల.. మాస్టర్ ఫ్లాన్ పై నిరసనలు

Exit mobile version