Bandi Sanjay Sensational Comments On CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కన్నతల్లిని చంపి, దండేసి కీర్తించే బాపతు కేసీఆర్ అని ఆరోపించారు. బతికినన్నాళ్లు జయశంకర్ సార్, కొండా లక్ష్మణ్ బాపూజీలను కేసీఆర్ అవమానించారని.. వాళ్లు చనిపోయాక దండేసి కీర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని, గాంధీజీ గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి నీర్వీర్యం చేస్తున్నారని.. అసెంబ్లీలో మాత్రం ఆ ఇద్దరిని ఆకాశానికెత్తేస్తున్నారని పేర్కొన్నారు. సర్పంచ్‌లు సహా ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థను కేసీఆర్ సర్వనాశనం చేశారని ఆరోపణలు చేశారు. కేసీఆర్‌కు దమ్ముంటే.. పంచాయతీలకు కేంద్ర, రాష్ట్రాలు ఇస్తున్న నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ చేశారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ సరఫరా చేస్తున్నట్లు నిరూపించే దమ్ముందా? అని ప్రశ్నించారు. మొక్కలు ఎండిపోతే సర్పంచ్‌ను సస్పెండ్ చేస్తున్నారని, మరి నిన్నెందుకు సస్పెండ్ చేయొద్దని అడిగారు. రామరాజ్యం కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని పిలుపునిచ్చారు. ఉచిత విద్య, వైద్యంతో పాటు పేదలకు ఇళ్లు, రైతులకు పంట నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.
iPhone: ఐఫోన్ మేకర్ ఫాక్స్‌కాన్ భారీ పెట్టుబడి.. బెంగళూర్‌లో 700 మిలియన్ డాలర్లతో ఫ్లాంట్
అంతకుముందు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేసిన బండి సంజయ్, తప్పకుండా రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని.. మహిళల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటివరకూ కేసీఆర్ చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. బీజేపీ మద్దతు ఇవ్వడం వల్లే తెలంగాణ ఏర్పాటుతో పాటు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారన్నారు. కేసీఆర్ కుటుంబం కోసమా తెలంగాణ తెచ్చుకుంది? అని రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారన్నారు. సీఎం కేసీఆర్‌కు సీబీఐ, పోలీసుల కంటే.. మహిళా మోర్చా అంటేనే భయమని దుయ్యబట్టారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారని.. ఒక్కో కుటుంబంపై కేసీఆర్ రూ.6 లక్షల అప్పు మోపారని అభియోగాలు చేశారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితులు లేకుండా చేశారన్నారు. రాష్ట్రంలో మద్యం వాడకాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ చెప్పారు.
VIZAG GIS Summit Food Festival: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో నోరూరించే వంటకాలు